అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా. కావాలంటే డబ్బులు కట్టేస్తా: కోడెల

Furniture and ACS were missing in the tenure of former assembly speaker Kodela

తవ్వుతున్న కొద్దీ మాజీ స్పీక్ కోడెల కుటుంబ సభ్యుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చివరకు అసెంబ్లీకి సంబంధించిన ఆస్తులను సైతం కోడెల కుటుంబీకులు వదల్లేదనే సమాచారం ఇప్పుడు బయటకు వచ్చాయి. హైదరాబాద్ నుండి అమరావతికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలించే సమయంలో చాల వరకు ఫర్నీచర్ సత్తెనపల్లి..నర్సరావుపేటకు తరలించారనేది అభియోగం. ఫర్నీచర్ తో పాటుగా ఏసీలు సైతం తరలి వెళ్లాయి. ఆ సమయంలో స్పీకర్ గా కోడెల ఉండటంతో ఈ విషయం పైన అంతర్గతంగా చర్చ మినహా..అసలు విషయం బయటకు రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో దీని పైన అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో..విచారణ మొదలైంది. ఏపీ అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ నర్సరావుపేట..సత్తెనపల్లికి వెళ్లిన మాట వాస్తమేననే పోలీసులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమైన ఘటనపై టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి సామాన్లు తరలించేటప్పుడు.. కొంత ఫర్నిచర్‌ను తాను వినియోగించుకున్నట్లు స్పష్టం చేశారు. ఫర్నిచర్ తీసుకువెళ్లాలని అసెంబ్లీ అధికారులకు తాను లేఖ కూడా రాశానని కోడెల గుర్తు చేశారు. కానీ శాసనసభ కార్యాలయ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదన్నారు.

నర్సరావుపేట లో వసళ్ల పర్వం కొనసాగించిన మాజీ స్పీకర్ కోడెల కుటుంబ సభ్యులు చివరకు అసెంబ్లీ ఆస్తులను వదల్లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ స్పీకర్ గా కోడెల శివ ప్రసాద్ ఉన్న సమయంలో హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీని అమరావతికి తరలించారు. ఆ సమయంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్.. ఏసీలు..ఇతర సామాగ్రిని సైతం అమరావతికి తీసుకొచ్చారు. అయితే, ఆ సమయంలో అక్కడి నుండి బయల్దేరిన ఆ ఫర్నీచర్..ఏపీలు పూర్తి స్థాయిలో అమరావతికి చేరలేదు. నూతన అసెంబ్లీ నిర్మాణ సమయంలోనూ పూర్తి స్థాయి ఫర్నీచర్.. సీలింగ్ ఏసీలు కావటంతో ఇక్కడ వినియోగించాల్సిన అవసరం లేదని కోడెల సంబంధీకులే వారికి వారే నిర్ణయించారని చెబుతున్నారు. దీంతో.. అక్కడ నుండి తరలించిన కీలక వస్తువులు..రికార్డులు మినహా మిగిలిన ఫర్నీచర్ తో పాటుగా ఏసీలను సైతం సత్తెనపల్లి.. నర్సరావుపేటకు తరలించారని వారి మీద అభియోగం. చాలా రోజులుగా అసెంబ్లీ ప్రాంగణంలో దీని మీద ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే కోడెల స్పీకర్ గా ఉన్న సమయంలో ఏ ఒక్కరూ దీని గురించి ఓపెన్ గా మాట్లాడటానికి ముందుకు రాలేదు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ఈ వ్యవహారం పోలీసుల కు చేరవేసారు. నేరుగా అసెంబ్లీ కార్యదర్శి బాలక్రిష్ణమాచార్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో…పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇప్పుడైనా అధికారులు వస్తే ఫర్నిచర్ అప్పగిస్తానని… లేకపోతే ఎంత ఖర్చు అయ్యిందో చెబితే చెల్లిస్తానని శివప్రసాద్ తేల్చి చెప్పారు. ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ పోయిందంటూ మంగళవారం ఉదయం వార్తలు రావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. 

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.