janampulse
Breaking News

వైసీపీ వంతు అయింది గంటాపై బీజేపీ టార్గెట్

ganta srinivasa rao fires on BJP

మాజీ మంత్రి ప్ర‌స్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు ఏడు సంవ‌త్స‌రాలు మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం… అయితే అప‌జ‌యం తెలియ‌ని నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరు ఉంది, కాని ఈసారి తెలుగుదేశం పార్టీలో మొత్తానికి ఎమ్మెల్యేగా గెలిచారు, విశాఖ‌లో వైసీపీ వేవ్స్ ఎలా ఉన్నా టీడీపీ గెలుపు నాలుగు వైపులా వ‌చ్చింది, ఇక గంటా రాజకీయంగా పార్టీలు మారినా మొత్తానికి ఈ సంక్షోభ స‌మ‌యంలో టీడీపీలోనే ఉన్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన విశాఖ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం ఆయన ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు.

Also Read ఏపీ ప్ర‌జ‌లకు గుడ్ న్యూస్ నేటి నుంచి మూడో విడ‌త రేష‌న్

ఎన్నికల్లో గెలిచిన తరువాత మాజీ మంత్రివ‌ర్యులు మళ్ళీ కనిపించలేదని సెటైర్లు వేశారు. నిజ‌మే ఈ క‌రోనా స‌మ‌యంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇంటికి ప‌రిమితం అయ్యారు, ఎవ‌రు బ‌య‌ట‌కు రాని ప‌రిస్దితి. అయితే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడాఓ ఇద్ద‌రు మిన‌హ ఎవ‌రూ ప్ర‌జ‌ల‌కు పెద్ద వ‌చ్చి సాయం చేస్తోంది లేదు.. అందులో గంటా కూడా ఒక‌రు ..

నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద క‌నిపించ‌డం లేద‌ట‌, ఇక ఈ ఎన్నిక‌ల్లో త‌న‌ని ప్రజలు ఓడించినా వారి కోసమే పనిచేస్తున్నానని, అయినా జనం దీన్ని చూసి ఓటు వేయరని తనకు బాగా తెలుసు అంటూ ప్రజల మీద రాజు గారు కామెంట్ చేశారు, మొత్తానికి వైసీపీ నేత‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ గంటా ఎక్క‌డ అని ప్ర‌శ్నించారు, ఇప్పుడు బీజేపీ నేత‌లు కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.