janampulse

ప్రపంచంలోనే అత్యంత అవినీతి నాయకుడు 3 లక్షల కోట్ల ఆస్తి బంగారం

Gold is the world's most corrupt leader

మన దేశంలోనే కాదు లంచం అనేది ప్రపంచాన్ని వేధిస్తోంది, అవినీతి అంటే వంద రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకూ ఉంటుంది అనేది మనకు ఏసీబీ అధికారుల సోదాల్లో కనిపిస్తుంది మళ్లీ ఉద్యోగంలో వీరు షరామాములే . ఇక కొందరు రాజకీయ పార్టీల నేతలు పెద్ద స్ధాయి ఉన్నత ఉద్యోగుల దగ్గర అయితే ఓ 50 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కనిపిస్తుంది.. వారి ఆస్తులు 100 కోట్లు ఉండచ్చు, గతంలో ఓ ఐఎఎస్ ఇంట 500 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు, ఇదే ఇండియాలో ఓ పెద్ద సెన్సేషన్ అయింది.. ఇంత అవినీతి చేశాడా అనుకున్నారు అందరూ. ఏకంగా అతని రోజు సంపాదన 25 లక్షలు అంత దోచేశాడు బల్లకింద చేతులు పెట్టి, ఇక కొందరు రాజకీయ నేతలు కూడా అంతే, వేల కోట్ల రూపాయలకు కుబేరులు అవుతారు జస్ట్ పదేళ్లు తిరిగేసరికి సైకిల్ పై తిరిగేవాడు బెంజ్ లో కనిపిస్తాడు.. అయితే ఇప్పుడు కనివిని ఎరుగని ప్రపంచంలో ఎక్కడా దొరకని అవినీతి తిమింగళం, అక్రమార్జన పరుడు దొరికాడు.

ఇటీవల చైనాలో అవినీతికి పాల్పడిన అధికారులు, కమ్యూనిస్టు పార్టీ నేతలపై ఇటీవలి కాలంలో జిన్పింగ్ ఫోకస్ పెట్టారు.
ఓ మాజీ మేయర్ను టార్గెట్ చేసి ఆయన నివాసాలపై నేషనల్ సూపర్వైజరీ కమిషన్ అధికారులు దాడులు చేయగా.. కళ్లు చెదిరే మొత్తంలో ఆస్తులు, బంగారం బయటపడ్డాయి. బంగారం అంటే మన దగ్గర దొరికినట్టు కిలోల చొప్పున కాదు.. టన్నుల్లో పసిడి దొరికింది. హైకౌ నగర మాజీ మేయర్ అయిన 58 ఏళ్ల ఝాంగ్ కి ఇంట్లో 13.5 టన్నుల బంగారం దొరికింది. బిస్కెట్ల రూపంలో పసిడి గుట్టలు గుట్టలుగా ఉండటాన్ని గుర్తించి అధికారులు నివ్వెరపోయారు. ఆ బంగారం విలువే అక్షరాలా రూ.4,500 కోట్లు కావడం గమనార్హం.

ఇక ఇప్పుడు చెప్పేది వింటే మతిపోతుంది మన ఏపీ బడ్జెట్ ఎంతో అంత నగదు అతని ఇంట్లో ఉంది.
మన కరెన్సీలో చెప్పాలంటే 2.64 లక్షల కోట్ల రూపాయల నగదును ఆయన ఇంటి బేస్మెంట్లో, బ్యాంక్ ఖాతాల్లో గుర్తించారు. ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందంటే.. నగదులో చైనీస్ కరెన్సీ మాత్రమే కాదు… డాలర్లు, యూరోలు కూడా ఉన్నాయట. అంటే అవినీతిలో అంతర్జాతీయ స్థాయి అన్నమాట. ఇక విల్లాలు అపార్ట్ మెంట్లు కమర్షియల్ కంప్లెక్సులు, షేర్లు, బాండ్లు, ఇన్వెస్ట్ మెంట్లు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పలు కంపెనీల్లో షేర్లు మేజర్ వాటాలు, ఉన్నాయి. ఆయన ఆస్తుల ముందు అలీబాబా అధినేత జాక్ మా సంపద కూడా దిగదుడుపే.

ఈ వ్యక్తి రోజుకి సంపాదించింది అవినీతితో 500 కోట్లు.. ఈ అక్రమార్కుడికి ఓ సొంత ఇళ్లు ఉంచి మిగిలినవి అన్నీ చైనా ప్రభుత్వం తీసుకుంటోందట, బంగారం బ్యాంకుల్లో అలాగే విల్లాలు కంపెనీలు ఫ్యాక్టరీలు స్ధలాలు అపార్ట్ మెంట్లు షాపింగ్ కాంప్లెక్సులు అన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటోంది, దీనికోసం 1500 మంది అధికారులను నియమించారట, వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.