సుజనాదారిలో మరో కీలక నేత బాబుకు గుడ్ బై

Good bye to Chandra Babu, another key leader

చంద్రబాబుని పల్లెత్తి మాట అనకుండా చూసుకోవాలి అంటే అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, మండలిలో బుద్దావెంకన్న, రాజ్యసభలో రమేష్,లోక్ సభలో రామ్మోహన్ నాయుడు, ఇలా నలుగురి పేర్లు ఆ పార్టీ అభిమానులు నేతలు చెబుతారు. కాని ఇప్పుడు ఇలాంటి నేతలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పరిస్దితి చూసి డైలమాలోఉన్నారు.. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి ఫలితాలు వస్తాయి అని సరదాగా కూడా కలలో కూడా భావించలేదు. కాని పరిస్దితి ఇలా మారిపోయింది.

ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బీజేపీ వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి, కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కారు ఏర్పాటుతో ఆయన ఆలోచనా ధోరణిలో మార్పు కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..మరి అదే బాటలో ఇంకా ఎవరు ఎవరు ఉన్నారు అనే చర్చ జరుగుతున్న వేళ చంద్రబాబుకి ఆర్దిక పిల్లర్లుగా చెప్పేవారిలో ముఖ్యుడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేరు కూడా వినిపిస్తోంది.

ఇక సుజనాకు అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనకు పదేపదే నోటీసులు జారీ చేయడం, కార్యాలయాల్లో సోదాలు, కేసులు తిరగతోడటం వంటి పరిణామాలు చోటు చేసుకొనడంతో పార్టీ మారాలి అని ఆలోచనలో ఉన్నారట.ఈ ఒత్తిడి వల్లే ఇప్పుడు సుజనా చౌదరి బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక దీనిని ఆయన కొట్టిపారేయలేదు, ఒకవేళ పార్టీ మారితే చంద్రబాబుకి చెప్పి పార్టీ మారతా అని చెప్పారు.

ఇక బాబుకు రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త సీఎం రమేశ్ వైఖరి ఇప్పుడు అర్ధం కాని పరిస్దితిలో ఉంది.. ఇక రెండు సార్లు బాబు వీరిద్దరికి రాజ్యసభ అవకాశం కల్పించారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఇద్దరికి చంద్రబాబు మాత్రం రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో సీఎం రమేష్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో గంటన్నర సేపు మాట్లాడారు అనేది టీడీపీలో పెద్ద అలజడి క్రియేట్ చేసింది. ఇప్పుడు రాజ్యసభలో మెజార్టీ బీజేపీకి లేదు, ఇప్పుడు కచ్చితంగా వారికి సభ్యులు అవసరం … ఈ సంవత్సరం నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకూ రాజ్యసభలోబీజేపీకి మరింత నెంబరింగ్ సపోర్ట్ వచ్చే అవకాశం లేదు. అందుకే ఇలా కొందరు నేతలు వస్తే చేర్చుకుని తన సంఖ్య పెంచుకోవాలి అని చూస్తోంది బీజేపీ ..మరి సీఎం రమేష్ మాత్రం దీనిపై ఇంకా ఏ విషయం తేల్చడం లేదట. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రం కాస్త సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హీట్ పెంచినా ఇప్పుడు శాంతించారు అని చెప్పాలి.

లోక్సభలో టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఎవరూ పార్టీ మారబోరని విజయవాడ ఎంపీ కేశినేని నాని తమ పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి లోక్ సభ ఒకే రాజ్యసభలో మాత్రం ఇంకెందరు పార్టికి రాం రాం చెబుతారు అనేది మాత్రం కాస్త ఆలోచన రేకెత్తిస్తోంది సైకిల్ పార్టీలో.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.