వైసీపీకి ఇద్దరు గుడ్ బై బీజేపీకి జై

Good bye to the YCP for two leaders joining to BJP

ఈసారి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్ధానాలకు పరిమితం అయింది. వైసీపీ 151 స్ధానాలను గెలుచుకుంది.ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక తెలుగుదేశం ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయింది అని చెప్పాలి.ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. మంత్రి వర్గ ఏర్పాటు కూడా జరిగిపోయింది. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది.

ఇక ఓటమి విషయంలో బాబు ఇంకా ఎందుకు తమకు ఓటమి వచ్చింది అనే విషయంలో ఆలోచన చేస్తున్నారు..అయితే సీఎం జగన్ పార్టీ ఫిరాయయింపులకు గేట్ తెరుస్తారు అని భావించిన టీడీపీకి జగన్ మాత్రం తీపి కబురు చెప్పారు.. తాను పార్టీ ఫిరాయింపులు ప్రొత్సహించను ఎవరైనా పార్టీలోకి రావాలి అంటే కచ్చితంగా ఆ పార్టీ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి అని చెబుతున్నారు .. మొత్తానికి తెలుగుదేశం పార్టీనుంచి ఇప్పుడు ఇంత సాహసం చేసేందుకు నేతలు ఎవరూ సిద్దంగాలేరు.

ఇక తెలుగుదేశం నేతలు మాత్రం ఎలాంటి కండిషన్లు పెట్టని బీజేపీ వైపు చూస్తున్నారు.. తాజాగా బీజేపీలో చేరిపోయారు తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు. ఇప్పుడు వీరు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి నేతలను చేర్చే పనిలో ఉన్నారు అని చెప్పాలి. ఇప్పటికే టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ కూడా పార్టీ మారిపోయారు.. ఇక ఆ దారిలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు అని తెలుస్తోంది.. ఈ సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి కూడా ఇద్దరు నేతలు పార్టీ మారడం పెద్ద ఎత్తున చర్చకు కారణం అయింది.

వైసీపీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు వజ్ర భాస్కర్ రెడ్డి, కాసు విజయభాస్కర్ రెడ్డిలు బీజేపీలో చేరిపోయారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోదీ విజన్ బాగుందని ఆయన దారిలో నడుస్తాము అని తెలియచేశారు. మొత్తానికి వైసీపీ నుంచి కూడా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేస్తోంది అని చర్చ నడుస్తోంది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.