ఈ వస్తువులఫై జీఎస్టీ పన్నుశాతం తగ్గింపు..!

జులై 1 2017 నుంచి అమలులోకి రానున్న వస్తుసేవల పన్ను(జీఎస్టీ) కాస్త ఉపశమనం కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. వ్యాపారులు,ప్రజలు నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన అనంతరం 66 రకాల వస్తువులపై పన్ను శాతాన్ని తగ్గించేందుకు జీఎస్టీ మండలి నిర్ణయించిందని ఆయన చెప్పారు.

ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ఆదివారం జీఎస్టీ మండలి 16వ సమావేశం నిర్వహించారు. వాస్తవానికి 133 రకాల వస్తువులపై పన్నుల శాతాన్ని తగ్గించాలని ప్రతిపాదనల కమిటీ సిఫార్సు చేసినప్పటికీ, వాటిలో 66 వస్తువలకు మాత్రమే జీఎస్టీ మండలి ఉపశమనం కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దీనితోపాటు ఉత్పత్తిదారులు, వ్యాపారులకు అందించే నష్ణపరిహార పథకం పరిధిని కూడా పెంచారు. ఇంతకముందు రూ.50 లక్ష టర్నోవర్‌ ఉన్నసంస్థలకు మాత్రమే నష్టపరిహారం అందిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ పరిధిని రూ.75 లక్షలకు పెంచింది.

తాజా ప్రతిపాదనలతో ఈ వస్తువులపై పన్ను శాతం తగ్గనుంది.

ప్లాస్టిక్‌ బెడ్స్‌ 28 నుంచి 18 శాతానికి తగ్గింపు
ప్లాస్టిక్‌ టర్పాలిన్‌ 28 నుంచి 18 శాతానికి తగ్గింపు
ఎక్సర్‌సైజ్‌ పుస్తకాలు 18 నుంచి 12 శాతానికి తగ్గింపు
కలరింగ్‌ బుక్స్‌పై 12 శాతంగా ఉన్న పన్నును పూర్తిగా ఎత్తేశారు
ప్రీకాస్ట్‌ కాంక్రీట్‌ పైపులు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు
ట్రాక్టర్‌ విడిభాగాలు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు
అగర్‌బత్తీలు – 12శాతం నుంచి 5శాతానికి తగ్గింపు
స్కూల్‌ బ్యాగులు – 28 శాంతం నుంచి 18 శాతానికి తగ్గింపు
డెంటల్‌ వాక్స్‌ – 28 నుంచి 18 శాతానికి తగ్గింపు
ఇన్సులిన్‌ – 12 నుంచి 5 శాతానికి తగ్గింపు
బాదాంపప్పు – 12 నుంచి 5శాతానిక తగ్గింపు
కంప్యూటర్‌ ప్రింటర్లు – 28 శాంతం నుంచి 18కి కుదింపు

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.