janampulse

పవన్ పై గెలిస్తే మంత్రి అవడం పక్కా గ్రంధికి జాక్ పాట్

Grandhi Srinivas YSRCP vs Pawan Kalyan Janasena Bhimavaram

రాజకీయంగా ప్రత్యర్దిపై గెలవడం అంటేనే ఆషామాషీ వ్యవహరం కాదు, అలాగే మంత్రిగా పనిచేసిన నేతలపై గెలవడం అన్నా మాములు విషయం కాదు.. ఇక సీఎం క్యాండిడేట్ పై గెలవడం అంటే అది చాలా పెద్ద విషయం. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ లు రెండు కూడా భీమవరం సెగ్మెంట్ పై ఫోకస్ పెట్టాయి. ఎన్నికలు అయిపోయాయి 70 వేల మంది కాపు ఓటర్లు ఉన్న భీమవరంలో కాపులు పవన్ కు ఓటేస్తే బీసీ ఓటు బ్యాంకులో 35 శాత పవన్ కు పడితే కచ్చితంగా పవన్ కు 5 వేల మెజార్టీ వస్తుంది ఇది ఓ సర్వే లెక్క, ఇక సగం కాపులు సగం బీసీ సగం క్షత్రియ ఓటు బ్యాంకు వస్తే 2000 ఓట్లు మెజార్టీతో పవన్ గెలుస్తారు ఇది ఓ లెక్క .కాపులు ఓట్లు సగానికి చీలిపోతే వైసీపీకి భారీగా 15 వేల మెజార్టీ వస్తుంది అనేది మరో లెక్క.

అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదు.. పైగా వైయస్సార్ సీపీ, జనసేన కూడాఇదే మెయిన్ ఎజెండాగా భీమవరంలో ప్రచారం చేశాయి.. ఇది పవన్ కల్యాణ్ కు గ్రంధి శ్రీనివాస్ కి కలిసి వస్తే, తెలుగుదేశం అభ్యర్ది పులపర్తి అంజిబాబుకు
(ఆంజనేయులు) నెగిటీవ్ అవుతుంది అంటున్నారు .భీమవరం అంటే పాష్ కల్చర్ ,రోడ్లు డ్రైయిన్ లే కాదు చాలా ఉన్నాయి అంటున్నారు ఇక్కడ జనం. మరి ఇలాంటి చోట ఐదు సంవత్సరాలలో అభివృద్ది ఏమీ జరుగలేదు అని విమర్శలు వస్తుంటాయి.

2014లో గ్రంధి శ్రీనివాస్ తన ప్రత్యర్థిపై 13,726 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.. ఇక ఐదు సంవత్సరాలుగా గ్రంధి శ్రీనివాస్ పెద్ద ఎత్తున ఇక్కడ పోరాటం చేశారు. టీడీపీ పై అలుపెరగని రాజకీయ యుద్దం చేశారు అని చెప్పాలి. గత ఏడాది భీమవరం నియోజకవర్గంలో పాదయాత్రకు వచ్చిన వైసీపీ నేత జగన్మోహన్రెడ్డితో గ్రంధి శ్రీనివాస్ బహిరంగ వేదికపైనే తన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయించుకున్నారు.

ఇక టీడీపీ తరపున చూస్తే ఎమ్మెల్యే రామాంజనేయులు కుమారుడు మంత్రి గంటా శ్రీనివాస్కు స్వయానా అల్లుడు. దీంతో రాజకీయం ఆయనతో ముడిపడి ఉంది, వియ్యంకులు ఇద్దరూ కూడా తెలుగుదేశంలో మంచి సత్సంబంధాలతో ఉన్నారు. అయితే కాంగ్రెస్ మూలాలు ఇంకా రామాంజనేయులకి ఉన్నాయి అంటారు, ఆయన తెలుగుదేశంలోకి వచ్చినా పాత టీడీపీ నేతలని పట్టించుకోలేదు అని విమర్శలు ఉన్నాయి. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం లో ఎంటర్ అవ్వడంతో తెలుగుదేశం మొత్తం గ్రాఫ్ తగ్గించుకుపోయింది. ఇక ఇక్కడ మెయిన్ పొలిటికల్ ఫైట్ వైసీపీ జనసేన మధ్య జరిగింది అంటున్నారు జనం.

ఇక గ్రంధి శ్రీనివాస్ కచ్చితంగా గెలుస్తారు అని ధీమాతో జిల్లా నేతలు ఉన్నారు. ఇక పవన్ పై గెలిస్తే కచ్చితంగా జిల్లా నుంచి ఆళ్లనానితో పాటు గ్రంధి శ్రీనివాస్ మంత్రి పదవి దక్కించుకుంటారు అని అంటున్నారు. ఇందులో నో డౌట్ అంటున్నారు నేతలు. ఎందుకు అంటే సీఎం స్ధాయి నాయకుడిని ఓడించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న రాజకీయ చదరంగం అంటారు. అదీ కరెక్టే అని చెప్పాలి. ఇదే విషయం పై వైసీపీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు.. పవన్ ధీమా ఎలా ఉన్నా ,జగన్ ధీమా అలాగే గ్రంధి శ్రీను సైన్యం ధీమాగా ఉన్నారు.

విశ్లేషణ-వీజీ

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.