
ఇక మరో ముహూర్తం పెట్టేసిన జగన్
ఏపీలో మూడు రాజధానుల నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనే అనుకోవాలి , అయితే గతంలో చంద్రబాబు అమరావతికి ఉద్యోగులు రావాలి అని పిలుపునిచ్చాడు.. చివరకు చాలా మంది ఆ సమయంలో అక్కడకు రావడానికి ఆలోచించారు.. కాని ఇప్పుడు ఉద్యోగులు విశాఖ వెళ్లాలి అంటే ఇష్టం చూపుతున్నారట, అక్కడ అన్నీ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగులు కూడా ఎస్ చెబుతున్నారు.
పిల్లలకు మంచి స్కూల్స్ కూడా ఉంటాయి.. కాబట్టి వారికి ఢోకా ఉండదు అని చెబుతున్నారు..ప్రస్తుతం రాజధానిగా కొనసాగుతున్న అమరావతిని లెజిస్లేటివ్ కేపిటల్ గా కొనసాగిస్తూనే… కొత్తగా ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖలో – జ్యూడిషియల్ కేపిటల్ ను కర్నూలులో ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే ఓ వర్క్ అయితే జరుగుతోంది.
తాజాగా సీఎం జగన్ ఎప్పుడు విశాఖ నుంచి పాలన మొదలు పెడతారు అంటే ఇప్పటికే అనేక డేట్లు బయటకు వచ్చాయి.. సర్కారు నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన అయితే రాలేదు, తాజాగా గడువును జగన్ సర్కారు మే నెలాఖరుగా నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాజధాని అమరావతిలో ఉన్న ఉద్యోగులంతా విశాఖకు తరలాల్సిందే… అంతేకాకుండా ఆయా ప్రభుత్వ కార్యాలయాలు కూడా విశాఖకు తరలాల్సిందే.
అంటే దీనికంటే ముందు ఫర్నిచర్ ఫైల్స్ అన్నీ తరలిపోవాలి. మరి ఈ సమయంలో ఉద్యోగులకి కూడా గుడ్ న్యూస్ చెబుతారట సీఎం జగన్, విశాఖకు తరలిన వెంటనే వారందరికీ 30 శాతం మేర డీఏను ఇచ్చేందుకు జగన్ సర్కారు సిద్ధంగా ఉంది అని తెలుస్తోంది. మొత్తానికి జూన్ మొదటి వారంలో పాలన అక్కడ స్టార్ట్ అవుతుంది అని తెలుస్తోంది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్