
విద్యార్థుల ధర్నా, ఇంటర్ బోర్డు వద్ద హైటెన్షన్.. కేసీఆర్ డౌన్ డౌన్
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ కావడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఇంటర్ బోర్డు, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఫెయిల్ అయ్యారని.. వారికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. సగానికి పైగా విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ కావడంపై విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో విషయం మరింత సీరియస్‌గా మారింది. పరీక్షల సన్నద్ధతకు సమయం ఇవ్వకుండానే పరీక్షలు నిర్వహించడంతోనే రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈరోజు మంగళవారం ఇంటర్ బోర్డు వద్ద ఏబీవీపీ, వైఎస్సార్‌టీపీ స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పలు కాలేజీల విద్యార్థులు ధర్నాకు హాజరై సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్.. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని నినదించారు. ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు భారీగా ఇంటర్ బోర్డు వద్దకు తరలిరావడంతో హైటెన్షన్ నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలు ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో విద్యార్థి నేతలు వాగ్వాదానికి దిగారు. ఇంటర్ విద్యార్థుల ఆందోళనతో పోలీసులను భారీగా మోహరించారు. సమస్య రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది.
నాలుగు రోజుల కిందట మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. సోమవారం నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకూ వాపపక్ష విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈరోజు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాయి.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్