
అద్దె చెల్లించకపోవడమే కారణం… గ్రామ సచివాలయానికి తాళం
కృష్ణా జిల్లాలో కోపమొచ్చిన ఒక ఇంటి ఓనర్ ఏకంగా గ్రామ సచివాలయానికే తాళం వేశాడు. ఉదయాన్నే డ్యూటీకి వచ్చిన ఉద్యోగులు చేసేదేమీ లేక ఆ సచివాలయం
కృష్ణా జిల్లాలో కోపమొచ్చిన ఒక ఇంటి ఓనర్ ఏకంగా గ్రామ సచివాలయానికే తాళం వేశాడు. ఉదయాన్నే డ్యూటీకి వచ్చిన ఉద్యోగులు చేసేదేమీ లేక ఆ సచివాలయం బయటే కుర్చీలేసుకుని కూర్చున్నారు. ఆర్నెల్లుగా అడుగుతున్నా ఎలాంటి మార్పు లేకపోవడం విసుగెత్తిన అతను ఇలా తాళాలేశాడు.
అసలేం జరిగిందంటే.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు 2 గ్రామ సచివాలయం అద్దె భవనంలో నడుస్తోంది. అయితే.. గత ఆరు నెలలుగా సచివాలయ భవనానికి చెల్లించాల్సిన అద్దె డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంతో ఈ రోజు ఉదయం తాళాలు వేశారు. డ్యూటీకి వచ్చిన గ్రామ సచివాలయం ఉద్యోగులు తాళాలు తీయకపోవడంతో చేసేదేమీ లేక బయటే కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. గతంలోనూ అనేకసార్లు గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయాలకు తాళాలు వేశారు. అద్దె చెల్లిండం లేదని ఒకరు.. కాంట్రాక్ట్ బిల్లులు ఇంకా చెల్లించడం లేదని ఇంకొకరు ఇలా పలుమార్లు గ్రామ సచివాలయాలకు తాళాలు వేశారు. మే 20వ తేదీ 2020వ సంవత్సరంలో కర్నూలు జిల్లా ఎమ్మగనూరు మసీదుపురం గ్రామంలోని గ్రామ సచివాలయానికి అద్దె చెల్లించలేదన్న కారణంతో తాళం వేశారు.
అదేవిధంగా.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగంభొట్లవారిపాలెం గ్రామ సచివాలయానికి 13 నెలలుగా అద్దె చెల్లించడం లేదన్న కారణంతో జూలై 1 2021న భవన యజమాని తాళం వేశారు. ఈ నెల 10వ తేదీన గుంటూరు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపురంలో భవన నిర్మాణానికి సంబంధించి బిల్లు రాలేదన్న ఆగ్రహంతో సచివాలయం 2కి తాళాలు వేసి రెండు గంటలపాటు సిబ్బందిని బయటే ఉంచారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్