
ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కు సోనియా గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మాములుగా లేవు, ప్రతీ దానికి దిల్లీ చుట్టు తిరుగుతుంటారు అని టీఆర్ఎస్ చేసే ఆరోపణలు మరింత పెంచుకుంటున్నారు. తాజాగా హుజుర్ నగర్ ఉప ఎన్నికలో అక్కడ అభ్యర్ది ఎవరు అనేదానిపై రాజకీయం మరింత హీట్ పుట్టింది… ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన అధికారపార్టీ టీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది
తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పేరును పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేశారు . ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉత్తమ్ భార్య పద్మావతి 2018 డిసెంబరు ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా పనిచేశారు.
కాని ఇక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి ఉత్తమ్కుమార్ రెడ్డి గెలిచారు.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగానూ గెలిచారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్నగర్లో ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో అందరి కంటే ముందుగా టీఆర్ఎస్ పార్టీ సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ కాంగ్రెస్ తమ సిట్టింగ్ స్ధానం గెలుచుకోవాలి అని చూస్తోంది. బీజేపీ సైతం శ్రీకళా రెడ్డిని తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. సో చూడాలి ఇక్కడ ఈ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందో.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్