జగన్ సాయం కోరిన కేసీఆర్ జగన్ గ్రీన్ సిగ్నల్

Huzoor nagar by poll election kcr asks help to jagan

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ కూడా పాలనలో సంక్షేమ కార్యక్రమాలు పధకాలలో పోటీ పడుతూ ముందుకు వెళుతున్నారు.. రాజకీయంగా ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు, గతంలో చంద్రబాబుతో వైరం ఉన్న కేసీఆర్ ఇప్పటికీ అలాగే ఉన్నారు , కాని జగన్ తో మాత్రం మిత్రబంధం కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుల విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయాలకు వచ్చి వివాదాలు పెట్టుకోని, ట్రెబ్యునల్స్ కోర్టులు కేంద్రం దగ్గర పంచాయతీలు వద్దు అని డిసైడ్ అయ్యారు.. ఇద్దరూ కలిసి చర్చించుకుంటున్నారు.

అయితే బాబు మాత్రం వీరిద్దరి స్టెప్స్ చూసి అవసరానికి తగ్గట్లు కౌంటర్లు వేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికల కాక రేపుతోంది. హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి పెద్ద అగ్నీ పరీక్ష అయింది .కాంగ్రెస్ పార్టీకి విజయం వచ్చినా అపజయం వచ్చినా పెద్ద లెక్క కాదు, కాని టీఆర్ఎస్ గెలవకపోతే ఇజ్జత్ పోతుంది అనేది అక్కడ ప్రభుత్వం ఆలోచన. అందుకే అక్కడ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.

ఈ సమయంలో వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ ను ఇక్కడ ఉప ఎన్నిక కోసం సాయం అడిగినట్లు తెలుస్తోంది.. ఎందుకంటే ఏపీలోనే ఫుల్ గా ఫోకస్ పెట్టిన వైసీపీ 2018లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయేలేదు. గత ఎన్నికల ఫలితాలు చూస్తే, 2014లో మాత్రం ఓట్లు వైసీపీకి గణనీయంగా వచ్చాయి,. 2014 ఎన్నికల్లో హుజూర్ నగర్లో తీసుకుంటే వైసీపీ మూడో స్థానంలో నిలిచింది అప్పుడు పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి గెలుపొందగా రెండోస్థానంలో టీఆర్ఎస్ నిలిచింది. మూడో స్థానంలో ఉన్న వైసీపీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్ రెడ్డి 16.55శాతం ఓట్లు సాధించారు. కాని జగన్ ఏపీ పై ఫోకస్ పెట్టి 2018 లో అక్కడ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

అయితే అక్కడ చాలా మంది వైసీపీ సానుభూతి పరులు ఉన్నారు, జగన్ అలాగే వైసీపీ తెలంగాణ నేతలు ఎవరికి మద్దతు అంటే వారికి మాత్రమే ఆ ఓట్లు పడతాయి, అందుకే కేసీఆర్ కూడా ఇప్పుడు జగన్ సాయం కోరినట్లు తెలుస్తోంది. అయితే జగన్ కూడా తమ వారితో సమావేశం ఏర్పాటు చేయిస్తా అని మాట ఇచ్చారట. సో తెలంగాణ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు జగన్ సాయం అనేది ఇప్పుడుచర్చ గా మారింది. మరి వైసీపీ కేడర్ జగన్ మాట ప్రకారం గులాబీ బాస్ కు సపోర్ట్ చేస్తారో లేదో చూడాలి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.