హూజూర్ న‌గ‌ర్లో కారుజోరు కాంగ్రెస్ బేజారు రిజ‌ల్ట్స్

Huzoor nagar bypoll results one side TRS

తెలంగాణలో హుజూర్ నగర్లో కారు జోరుమీద ఉంది, కాంగ్రెస్ బేజారింది. సైకిల్ పార్టీ కనుమరుగు అయింది, క‌మ‌లం వాడింది అనే చెప్పాలి, ఉప ఎన్నిక ఫలితాలు కారు పార్టీకి జోష్ తీసుకువచ్చాయి.. హుజూర్నగర్ ఉప ఎన్నికకు లెక్కింపు జరుగుతోంది, తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యత చూపుతున్నారు.

లెక్కింపునకు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 22 రౌండ్లు జరగనుంది. రెండో రౌండ్ టీఆర్ఎస్ 4000
మూడో రౌండ్ పూర్తియ్యేసరికి 6,787 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. నాలుగో రౌండ్ లెక్కింపులో.. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి 9,356 ఓట్ల ఆధిక్యత చూపించారు. ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి 11 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ముందుకు సాగారు
ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థిపై 12,300 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు..

ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపులో14,300 ఓట్ల వెనకంజలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఉన్నారు. తొమ్మిదో కౌండ్ పూర్తయ్యే సరికి 16,495 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఇక సైదిరెడ్డి దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారు అని చెబుతున్నారు అక్క‌డ ప్ర‌జ‌లు ప‌రిశీల‌కులు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.