సోనియా రాహుల్ కు షాకిచ్చిన చంద్రబాబు

Huzoor nagar TDP candidate chava kiranmai

దేశంలో చక్రం తిప్పిన నాయకుడు, ప్రధాని మోదీని కూడా పదవి నుంచి దింపే సాహసం చేసిన నాయకుడు అంటే దేశంలో చంద్రబాబు పేరు చెబుతారు… ఆయనంత సీనియర్ దేశంలో ఎవరూ లేరు అని ఆయనే చెబుతారు, 40 ఏళ్లుగా రాజకీయాల్లోఉన్నారు కాబట్టి, ఆయనే దేశంలో సీనియర్ అని చెబుతారు. అయితే అదంతా ఆయన చెప్పేమాట, కాని ఈ ఎన్నికల్లో మాత్రం చిత్ర విచిత్రాలు జరిగాయి. ఉప్పు నిప్పుగా ఉండే టీడీపీ కాంగ్రెస్ కలవడం, పైగా సోనియా రాహుల్ తో కలసి బాబు ఎన్నికల ప్రచారం చేయడం, తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి అడుగులు వేయడం, అసలు 2018లో జరిగిన రాజకీయం 30 ఏళ్లుగా ఎవరూ చూడలేదు అని అంటారు.

ఇక బాబుతో పొత్తు ఎవరు పెట్టుకుంటే వారికి విక్టరీ పక్కా అని కాంగ్రెస్ భావించింది. కాని ఇద్దరూ బోర్లా పడ్డారు. వెంటనే ఏపీలో మాత్రం సింగిల్ గా సైకిల్ తొక్కారు చంద్రబాబు, ఎవరిని వెనకాల ఎక్కించుకోలేదు, అసలు కాంగ్రెస్ కు ఆరడుగులు దూరంలో ఉండిపోయారు చంద్రబాబు.

ఇక తెలంగాణలో హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ పోటీకి సైఅంది. ఇక కాంగ్రెస్ సీటు కాబట్టి మరి అక్కడ ఏం జరుగుతుంది? పొత్తు బాబు తో పెట్టుకుంటారా అని చూశారు అందరూ , మరి బాబు ఆలోచించి తాము సింగిల్ గా పోటీ చేస్తాం అన్నారు.. టీడీపీ పోటీ చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన టీడీపీ ఈ సారి స్వతంత్రంగా పోటీ చేస్తోంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న చావా కిరణ్మయికి టికెట్ కేటాయించారు. ఇక పార్టీ తరపున టీటీడీపీ అధ్యక్షుడు రమణ కిరణ్మయికి బీ-ఫామ్ అందజేశారు. కిరణ్మయి స్వగ్రామం హుజూర్నగర్. 2017 నుంచి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా పనిచేస్తున్నారు.

పూర్తిపేరు: చావా కిరణ్మయి
భర్తపేరు :చావా సహదేవరావు
పుట్టినతేదీ: 1971జనవరి14
తల్లితండ్రులు: అరిబండి వెంకటరామయ్య- సీతమ్మ
గ్రామం: హుజుర్నగర్
విద్యాభ్యాసం: డిగ్రీ
వృత్తి : రాజకీయం

అయితే తెలంగాణ లో మాత్రం చాలా మంది బాబు ఈ డెసిషన్ తీసుకోవడం పై డైలమాలో ఉన్నారు.. బాబు మద్దతు ఇస్తారు అనుకుంటే ఇలా కాంగ్రెస్ ను వదిలెయ్యడం ఏమిటి అని బాధపడుతున్నారట… సోనియా రాహుల్ కూడా పాపం బాధపడి ఉంటారు అని అంటున్నారు, అయితే టీడీపీ మాత్రం అసలు మన పరిస్దితి ఇక్కడ ఎలా ఉందో తెలుసుకుందాం అని ట్రయల్ వేస్తోంది అంటున్నారు ఇక్కడ జనం? నిజంగా చూడాలి అసలు టీడీపీకి ఇక్కడ ప్రజా మద్దతుఎలా ఉందో? ఎందుకంటే సింగిల్ గా పోటీ చేస్తేనే తెలుస్తుంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.