రెడ్డిగారి సర్వే విడుదల జగన్ కే పట్టాభిషేకం

Hyderabad reddy survey released Jagan is win

అందరి సర్వేలు చూస్తున్నారు వింటున్నారు, నా సర్వే కూడా చూడండి వినండి అంటున్నారు ఓ ప్రొఫెసర్.. అవును ఇప్పుడు ఈయన సర్వే గురించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఇక లగడపాటి సర్వే వచ్చేలోపు చాలా మంది సోషల్ మీడియా వేదికగా మీడియాలలో కూడా కాస్త తెలివిగా తమ సర్వేల గురించి అధికారంలోకి రాబోయేది ఎవరు అనేది క్లారిటీ ఇస్తున్నారు.. హైదరాబాద్ నగరానికి చెందిన రెడ్డి అనేటటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని , రాష్ట్ర ప్రజల పల్స్ను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు.. ఆయన సర్వే గురించి కూడా ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. మరి ఆయన సర్వేలో ఏమి తేలింది అనేది చూద్దాం.

దాదాపు ఆరు నెలలపాటు తిండి తిప్పలు లేకుండా, ఇళ్లు వాకిలి వదిలి ఏపీ వ్యాప్తంగా పర్యటించిన ఆ సర్వేను ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానెల్లో రిలీజ్ చేశారు. తనకు రాజకీయాలంటే ఇంట్రస్ట్ , అందుకే ఇలా సర్వే చేశాను అని ప్రజల పల్స్ తెలుసుకున్నాను అని చెప్పారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 105 నుంచి 109 అసెంబ్లీ స్థానాలను గెలుపొందుతుందని, అలాగే మొత్తం 17 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధుల మధ్య టఫ్ ఫైట్ జరుగుతుందని, అందులోను జనసేన మూడు గెలుపొందగా, మిగిలిన 14 స్థానాల్లో ప్రధాన పోటీ వైసీపీ – టీడీపీ మధ్యనే కొనసాగుతుందని అసిస్టెంట్ ప్రొఫెసర్ రెడ్డి చేసిన సర్వే తెలిపింది.

ఇక తెలుగుదేశం పార్టీ చాలా తక్కువ స్ధానాలు మాత్రమే గెలుస్తుంది అని చెప్పారు.. ఇక అధికారంలోకి మాత్రం వైసీపీ వస్తుంది అని అన్నారు. మరో పక్క రెడ్డిగారి సర్వేని చూసి కొందరు తెలుగుదేశం నేతలు ఇదంతా ఫేక్ అంటున్నారు.. కాని ఆయన జనం పల్స్ తీసుకున్నారు అని, ఇది వాస్తవం అని చెబుతున్నారు నేతలు.. మొత్తానికి ఇప్పుడు ఈ సర్వే లగడపాటి సర్వే వచ్చే వరకూ జనం నోట వినిపిస్తుందట.. చూడాలి ఈయన సర్వే కూడా మీడియా సంస్ధలు నోట్ చేశాయి.. అసలు డిబేట్ లోనే రికార్డు అయ్యాయి. అందుకే ఈసారి రిజల్ట్ ఎవరికి పాజిటీవ్ గా వచ్చినా సర్వే సంస్ధలు మాత్రం పెద్ద ఎత్తున ఈ సర్వేలు మావి కరెక్ట్ అని చెబుతాయి. ఈసారి కచ్చితంగా చూడాలి ఎవరి రిజల్ట్ కరెక్ట్ అనేది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.