బీజేపీతో కలిసే ఉన్నా క్లారిటీ కల్యాణ్

మొత్తానికి తాను కమలం పార్టీకి దగ్గరనే ఉన్నాను ,నేను బీజేపీ ఒకటే అని ప్రజలకు క్లారిటీ అయితే ఇచ్చారు పవన్ కల్యాణ్.. రెండు రోజుల నుంచి ఈ విషయం పై కాస్త లీక్స్ ఇస్తున్న పవన్ కల్యాణ్ ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేశారు.. బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ వాళ్లు నాకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలన్నారు. మరి పవన్ ఇలా దెండం ఎందుకు పెట్టాలి అని కామెంట్ చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఎందుకంటే.. నేను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ ఎక్కడ ఉండేది?, అసలు వైసీపీ అధికారంలోకి వచ్చేదా?, నేను విలువలకు కట్టుబడి మానుకున్నాను. ఎంతమందితో వైసీపీ వాళ్లు నా దగ్గరికి వచ్చారో గుర్తు లేదా?, అవాకులు, చవాకలు పేలే వైసీపీ నేతలు ఇవి తెలుసుకుని మాట్లాడాలని పవన్ అన్నారు, అయితే చంద్రబాబులా పవన్ కూడా పొత్తులేకుండా తాను గెలవలేను అనేది తాజా కామెంట్లతో క్లారిటీ ఇచ్చారు అంటున్నారు వైసీపీ నేతలు.

అసలు ఏ పొత్తు లేకుండా జగన్ 151 సీట్లు గెలుచుకున్నారు. ఈ సమయంలో పవన్ ఇలా కామెంట్లు చేయడంతో జనసేన కూడా త్వరలో కాషాయంలోకి కలవనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. అంతేకాదు జగన్ లా సొంతంగా గెలిచే సత్తా ఇక టీడీపీకి పవన్ పార్టీకి లేదా అనే అనుమానాలు వస్తున్నాయి.. మరి సింగిల్ గా పోటీ చేసిన పవన్ ఎందుకు గెలవలేదు, మరి ముగ్గురు కలిసి పోటీ చేసి ఉంటే గెలిచేవారా? ఇదేనా పవన్ చెప్పేది అని మేధావి వర్గం కూడా ప్రశ్నిస్తోంది. కేవలం ప్రత్యేక హోదా విషయంలో సిద్ధాంతపరంగా విబేధించినట్లు చెప్పారు పవన్ మరి ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదు అంటున్నారు వైసీపీ నేతలు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉల్లి ధరలు తగ్గించలేకపోయారు? ప్రజలకు మాణిక్యాలు అవసరం లేదు, నిత్యావసరాలు ఇస్తే చాలన్నారు పవన్ . రాయలసీమ యువత మార్పు కోరుకుంటుందని తెలిపారు. మొత్తానికి నాలుగు మాటల్లో పొలిటికల్ కామెంట్లతో పవన్ హీట్ పుట్టించారు. ఉల్లి లొల్లి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.