బోండా ఉమా పార్టీ మారితే ఆ పోస్టు ఎవరికి ?

If the Bonda Uma party, who is that post

ఎన్నికల్లో ఓటమి వచ్చిన తర్వాత తమ వారు ఎవరు బయట వారు ఎవరు అనేది ఆ పార్టీలకు చాలా తొందరగా తెలుస్తుంది.. ఇప్పుడు ఏపీలో కూడా చంద్రబాబుకి పక్కాగా తన వారు ఎవరు అనేది తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమి పాలు అవడంతో ఆ పార్టీ తరపున గెలిచన నేతలు ఎవరు తనవైపు ఉంటారు అనే డైలమా ఆందోళన చంద్రబాబుకి పెరిగిపోయింది. దిల్లీలో చక్రం తిప్పుతా అని చెప్పిన చంద్రబాబు ఏపీలో చక్రం తిప్పలేకపోయారు అనేది ఈ ఎన్నికల రిజల్ట్ చూస్తే తేలిపోయింది. ఇక బీజేపీమాత్రం ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం జపిస్తోంది. దీంతో ఎవరు ఉంటారు ఎవరు పార్టీ మారతారు అనే డైలమా టీడీపీలో కలుగుతోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు కాషాయం కండువా కప్పుకున్నారు.

ఉన్నా 23 మందిలో ఎవరు పార్టీ మారిపోతారు అనే చర్చ టీడీపీలో అంతర్గతంగా నడుస్తోంది.ఈ సమయంలో విజయవాడ సెంట్రల్ టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలో కీలకనేత, సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కొందరు పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇటీవల కాకినాడలో జరిగిన కాపు నేతల సమావేశం అనంతరం నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు. కాపు నేతల సమావేశానికి ఆయన కూడా వెళ్లారు. తర్వాత ఈ విషయం తెలిసిన బాబు ఉమాతో చర్చించారు ఫోన్లో బుజ్జగించారు.జూలై 1న జరగబోయే కాపు నేతల సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడు కుందామని చంద్రబాబు నచ్చచెప్పినట్లు తెలిసింది.

ఈ ఎన్నికల్లో ఆయన పెద్ద ఓటమితో ఓడిపోలేదు అని చెప్పాలి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 25 ఓట్ల స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణుపై ఓటమి చెందారు. ఇక ఉమా విసుగు చెందడానికి కారణం కూడా ఉందట, పార్టీ సెంట్రల్ కార్యాలయం నుంచి ఫోన్ల మీద ఫోన్లు క్రింది స్ధాయి నేతలకు కార్పొరేటర్లకు వస్తున్నాయట.. బోండా ఉమా పార్టీ మారితే ఆయన తర్వాత ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరు అనేది ఆ ఫోన్ లో వ్యక్తులు అడుగుతున్న ప్రశ్న, దీంతో ఉమా కలవరం చెందారట. తాను పార్టీ మారడం లేదు అని చెబుతున్నా తన పై దుష్ప్రచారం చేస్తున్నారు అని బాధపడుతున్నారు. ఇక సెంట్రల్లో నలుగురు కార్పొరేటర్లకు కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని వారు ఉమ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు.

అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయం సీరియస్ గా తీసుకున్నారట. కచ్చితంగా ఈ విషయం పై పార్టీ కార్యలయం వారితో చర్చిస్తాను అని చెప్పారట. దీంతో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవడమే కాకుండా పార్టీ ఇమేజ్ కూడా పోతుంది అని ఉమా ఆవేదన వ్యక్త పరిచారట .అయితే ఉమా మాట వింటూనే బాబు ఇలా నేతలను ఓపినియన్ అడిగారు అనేది అక్కడ నేతలు చెబుతున్న మాట. మరి ఉమా పొలిటికల్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.