ఈ ప‌ని చేస్తే జ‌గ‌న్ ను శ‌భాష్ అంటా – ప‌వ‌న్ క‌ల్యాణ్

If this is done Jagan will be called good work - Pawan Kalyan

వైసీపీ అధినేత అది గ‌తం, ఇప్పుడు ఏపీకి సీఎం.. మ‌రి ప‌రిపాల‌న‌లో కొత్త ద‌నం చూపించాలి అందుకే జ‌గ‌న్ అద్బుత‌మైన పాల‌న ఆరునెల‌ల ఇస్తాం అని చెప్పినా, ఆయ‌న ఒక్క‌నెల‌కే రాజన్న పాల‌న చూపిస్తున్నాడు అని అంటున్నారు జ‌నం. ముఖ్యంగా అవినీతి అక్ర‌మాలు త‌న ప్ర‌భుత్వంలో ఉండ‌వు అని మొద‌టి నుంచి చెబుతూనే ఉన్నారు జ‌గ‌న్.. ఇక మంత్రుల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తే వారిని బ‌ర్త‌ర‌ఫ్ చేస్తాను అని కూడా చెప్పారు.. సో ఏపీలో అవినీతి పాల‌న అనే మాట మీడియా కూడా ఎక్క‌డా విప్పేలా లేదు.. నిజంగా చాలా చోట్ల ప‌రిస్దితి మారిపోయింది. ఎవ‌రైనా ఏ ప‌ని అయినా అధికారి చేయ‌కుండా తిప్పిస్తున్నా నేరుగా వైసీపీ నేత‌ల నుంచి ఫోన్లు వ‌స్తున్నాయి. లంచాల‌కు మ‌రిగిన వారు ఇప్పుడు ఆ లంచాల‌ను మానేశారు అని చెప్పాలి.

అయితే తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత మాజీ సీఎం చంద్ర‌బాబుకు వ‌రుస షాక్ ల మీద షాక్ లు త‌గులుతున్నాయి .. ఓ ప‌క్క పొలిటిక‌ల్ గా బీజేపీ ఆ పార్టీ నేత‌ల‌ను చేర్చుకుని ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతుంటే, మ‌రో ప‌క్క వైసీపీ ఏపీలో ఆ పార్టీకి షాక్ లు ఇస్తోంది. కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజా వేదిక భవనాన్ని కూల్చి వేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారిచేశారు.

దీనిపై తెలుగుదేశం నేత‌లు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తున్నారు.. ఇదంతా కావాల‌ని క‌క్షపూరితంగా చేస్తున్న ప‌ని అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే ఏపీలో ఒకే ఒక్క సీటు గెలిచిన జ‌న‌సేన కూడా పొలిటిక‌ల్ గా యాక్టీవ్ అయింది. ఇలా క‌ర‌క‌ట్ట‌పై అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత అలాగే ప్ర‌జావేదిక కూల్చివేయాలి అని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వాగతించారు. అక్రమ నిర్మాణాలు ఎవరు కట్టినా అంగీకరించ కూడదన్నారు. అయితే ఇక్కడే పవన్ జగన్ కు ఓ పెద్ద సవాల్ విసిరారు.

ప్రజా వేదిక తో పాటు కృష్ణా కరకట్ట పై ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలు కూల్చి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ పని చేస్తే జగన్ ను తాను శభాష్ అంటాను అన్నారు. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్రజా వేదిక కూల్చి వేయాలన్న నిర్ణయం సంచలనం గా మారింది. సో ప‌వ‌న్ కూడా పొలిటిక‌ల్ గా ఇప్పుడు ప్ర‌తీ అంశం పై పోరాటం చేయాలి అని భావిస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి ప‌వ‌న్ శ‌భాష్ అన‌డం ఎలా ఉన్నా, జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాలు అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్నాయి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.