బాలయ్య ఇంట్లో టీడీపీ సోషల్ మీడియా కార్యాలయం?

In Balakrishna house TDP Social media office

ఇటీవల చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారు అంటూ గంటన్నర సోషల్ మీడియా సమావేశం నిర్వహించి మీడియాతో ముచ్చటించి ఉపన్యాసం ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ ప్రసంగం తర్వాత తెలుగుదేశం నేతలకు నేనున్నాను అనే దైర్యం ఇచ్చారు.. అయితే అదే దైర్యంతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైన్యం ఏపీ సీఎం జగన్ పైన దారుణమైన పోస్టులు దూషణలు చేస్తూ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వదులుతున్నారు, దీంతో వైసీపీ నేతలు మండిపడుతున్నారు

చంద్రబాబు చెప్పిన మాటల వల్లే ఇదంతా వీరు చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు.. అంతేకాదు ఈరోజు డీజీపీ గౌతం సవాంగ్ను వైసీపీ ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. సీఎం జగన్పై, వైసీపీ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా కొందరు తెలుగుదేశం నేతలు మహిళా ప్రజా ప్రతినిధులని కూడా చూడకుండా దారుణమైన పోస్టులు పెడుతున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. చంద్రబాబు ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు అనేది గుర్తు ఉంచుకోవాలని చెప్పారు, వైయస్ విజయమ్మ షర్మిలపై దారుణమైన పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు వైసీపీ నేతలు.

ఎమ్మెల్యే జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు, దారుణంగా సమాజంలో చెప్పుకోలేని విధంగా అసభ్య పదజాలం ఉపయోగించి సీఎం జగన్ పై పోస్టులు పెడుతున్నారని, దీనిపై డీజీపీ కి ఫిర్యాదు చేశామని తెలియచేశారు. చంద్రబాబు పెట్టిన క్షోభవల్లే ఎన్టీఆర్, కోడెల చనిపోయారని, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంట్లో టీడీపీ సోషల్ మీడియా కార్యాలయం నడుస్తోందని జోగి రమేశ్
ఆరోపించారు.. దీంతో ఇప్పుడు ఇదో పెద్ద చర్చకు కారణం అయింది, అయితే బాలయ్య బాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యాలయం నడుస్తుందనే కామెంట్ పై ఏపీలో అందరూ చర్చించుకుంటున్నారు. మరి దీనిపై టీడీపీ ఏం చెబుతుందో చూడాలి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.