గోదావరి జిల్లాలో కర్రలతో కొట్టుకున్నవైసీపీ, టీడీపీ శ్రేణులు. 10 మందికి గాయాలు

In the Godavari district, the sticks are tied with YCP and TDP

కక్షలు, కార్పన్యాలతో ఇప్పుడు ఒకరి మీద ఒకరు దాడులకు తెగబడుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే టీడీపీ శ్రేణుల మీదే వైసీపీ శ్రేణులు దాడులకు దిగుతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇలా దాడులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదని టీడీపీ తేల్చి చెప్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా బి. కొత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలు సద్దుమణగక పోవటంతో వారు ఎదురెదురు కాగా ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకోవడంతో కొంతమందికి తలపై బలమైన గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బి. కొత్తూరు గ్రామం సమస్యాత్మక గ్రామం . ఇక ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర నుంచి వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే సమస్యాత్మక ప్రాంతం కావడంతో పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు.

కానీ పోలింగ్ రోజున చెలరేగిన ఘర్షణలు ఇప్పటికీ చల్లారలేదు. ఇరువర్గాలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేదికాదని అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.ఇరు వర్గాల నుండి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. మొదటి కేసులో సెక్షన్ 341, 324 ( ఆయుధాలతో కావాలని దాడి చేయటం ) , హత్యా యత్న నేరం సెక్షన్ 307, RWసెక్షన్ 34 ( అనేక మంది వ్యక్తులు కలిసి నేర చట్టం) ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ప్రకారం ప్రత్యర్థి వర్గంలోని ఎనిమిది సభ్యులకు వ్యతిరేకంగా మొదటి కేసు నమోదైంది. రెండవ కేసులో ఐపిసి సెక్షన్ 19 క్రింద 20 మందిపై కేసు నమోదు అయ్యింది . 99 సెక్షన్ , సెక్షన్ 307 కింద కేసు దాఖలు చేశారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.