జగన్ కు ఈ విషయంలో పెరుగుతున్న మద్దతు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏపీలోనే కాదు పలు స్టేట్స్ లో కూడా చర్చకు కారణం అయింది…ఆంగ్ల మాధ్యమం అమలుకు తీసుకున్న నిర్ణయం ఇపుడు ఆయా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుండే ఇంగ్లీషు విద్యాబోధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో పై కొందరు విమర్శలు ఆరోపణలు చేశారు, అయితే సీఎం జగన్ మాత్రం తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఆ విమర్శలు పక్కన పెట్టి ముందకు వెళుతున్నారు.
అయితే రాజకీయ నేతలు పెడుతున్న పేచీ చూడటానికి వినడానికి అసహ్యంగా ఉంది. నీతులు సూక్తులు చెప్పే కొందరు నేతలు, తమ పిల్లలని ఇంగ్లీష్ స్కూళ్లో చదివిస్తున్నారు.. తెలుగు బ్రతకాలి అని కోరుకుంటూనే కార్పొరేట్ కాలేజీలు స్కూళ్లు ఇంగ్లీష్ లో నడుపుతున్నారు.. ఇలాంటి రెండు నాల్కల దోరణి ఉండే నేతల గురించి ప్రజలు కూడా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి దీనిపై వ్యతిరేకత రాలేదు. దీనిని అందరూ హర్షిస్తున్నారు అలాగే స్టూడెంట్స్ కూడా ఉచితంగా స్కూల్లో ఇంగ్లీష్ పాఠాలు చెబితే మేము బాగా చదువుకుంటాము అంటున్నారు.
దీనిపై ఇక్కడ సర్కారీ బడుల్లో చదువుకుని విదేశాల్లో సెటిల్ అయిన వారు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్దిస్తున్నారు.. తాము అమెరికా లాంటి దేశాలు వెళ్లిన సమయంలో ఇంగ్లీష్ రాక కాస్త ఇబ్బంది పడ్డాం, చిన్నతనం నుంచి ఇంగ్లీష్ బోధన ఉంటే పిల్లలు ఎక్కడైనా బతకగలరు, ఉద్యోగం చేయగలరు, ఇలాంటి కొందరు చెత్తరాజకీయ నేతల వల్లే మన సమాజం ఇంకా వెనకాల ఉంది, దయచేసి ఇలాంటి మంచి పనికి అడ్డు రాకండని చెబుతున్నారు.. మొత్తానికి విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా సోషల్ మీడియాలో జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు, ఇలా ఇంగ్లీష్ మీడియానికి అడ్డు పలికే నేతల పిల్లల్ని కూడా, సర్కారీ బడిలో చేర్పించి అప్పుడు కామెంట్లు చేయండి అని పిలుపునిస్తున్నారు.
Latest Updates
- పార్టీ మార్పుపై జేసీ వారసుడు క్లారిటీ
- జగన్ పై విజయశాంతి ప్రశంసలు
- కృష్ణా జిల్లాలో జగన్ మాస్టర్ ప్లాన్ అదిరింది
- మరో కీలక పదవి స్వీకరించిన సీఎం జగన్
- గన్నవరంలో సరికొత్త ఫార్ములా – జగన్
- స్పీకర్ వర్సెస్ చంద్రబాబు ఎవరూ భయపడరిక్క
- టీడీపీ నేతలని పిచ్చాస్పత్రిలో చేర్పించాలి – జగన్
- చంద్రబాబు అత్తగారికి పదవి ఇచ్చాము జగన్
- పవన్ కు షాకిస్తూ జగన్ కు జై కొట్టిన ఎమ్మెల్యే
- అసెంబ్లీలో వీడియో చూపించి బాబు పరువు తీసిన కొడాలి నాని
- జగన్ గారు మాకు ఆ కంపెనీకి సంబంధం లేదు – నారా భువనేశ్వరి
- వీరిద్దరిలో ఎవరి నవ్వు నిజాయితీగా అనిపిస్తుంది
- పార్టీ మార్పుపై గొట్టిపాటి క్లారిటీ
- జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు