janampulse

లవ్ అగ‌ర్వాల్ ఓ స‌రికొత్త వార్త మీకు తెలుసా

Interesting news on love agarwal

దేశవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి గురించి నిత్యం మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి అనేక విష‌యాలు చెబుతున్నారు అధికారి ల‌వ్ అగ‌ర్వాల్… అంతేకాదు వైర‌స్ కేసులు ఎన్ని ఉన్నాయి ఎంత మంది క్యూర్ అయ్యారు ఇలా అనేక విష‌యాలు చెబుతున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్, అయితే ఆయ‌న గురించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది.

Also Read ఏప్రిల్ 15 వ‌ర‌కే లాక్ డౌన్ కేంద్రం సంకేతాలు ఆధారాలు ఇవే

ఇప్పుడు అంద‌రి క‌న్నా బీజీ ఆఫీస‌ర్ గా ఆయ‌న మారిపోయారు, నిత్యం ప్ర‌తీ స్టేట్ లో ఉన్న అధికారుల‌తో మాట్లాడ‌టం, అలాగే అక్క‌డ కేసులు ఆరోగ్య ప‌రిస్దితులు అన్నీ తెలుసుకుంటున్నారు. అయితే ఆయ‌న ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారి అనే విష‌యం చాలా త‌క్కువ మందికి తెలుసు. 1996 బ్యాచ్ కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్ తెలుగు చక్కగా మాట్లాడతారు.

ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక.. విభజన త‌ర్వాత తెలంగాణలోనూ పని చేశారు. గ‌తంలో ఏపీ క‌లిసి ఉన్న స‌మ‌యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా ఆయన పని చేశారు. జిల్లాలో ఏ స‌మ‌స్య ఉన్నా అగ‌ర్వాల్ గారికి చెబితే తీరిపోయేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన త‌ర్వాత 2014లో తెలంగాణ క్రీడలు యువజన శాఖ కార్యదర్శిగా పని చేశారు. త‌ర్వాత డిప్యుటేషన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు.ఆయ‌న యూపీకి చెందిన వ్య‌క్తి, ఆయ‌న ఎక్కువ‌గా తెలుగు స్టేట్స్ లోనే ప‌ని చేశారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.