బాబు బయటకు పంపే వరకూ కేశినేని ఆపరంట

nani-babu

కేశినేని నాని ఈ ఐదు సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉంటడంతో ఆయన కూడా పెద్ద వార్తల్లో నిలిచింది లేదు.. కాని ఇప్పుడు టీడీపీ అధికారంలో లేదు , ఓ పక్క ప్రతిపక్షంలో ఉంది. ఆ పార్టీలో గెలిచిన ముగ్గురిలో నాని ఒకరు, ఆయన కూడా ఇప్పుడు టీడీపీలో కొనసాగుతూనే ఆపార్టీలో ఎలాంటి పరిస్దితి ఉందో చెబుతున్నారు.. ఆయన ఫేస్ బుక్ లో ఈసారి గెలిచిన తర్వాత మరింత యాక్టీవ్ అయ్యారు, నిత్యం పోస్టుల పై పోస్టులు పెడుతూ టార్గెట్ చేస్తున్నారు పలువురి నేతలను.

భయం తన రక్తంలో లేదని, ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ నాని స్పష్టం చేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, తిరుగుబావుట ఎగరవేసిన నాని.. తాజాగా మరో పోస్టు పెట్టారు సోషల్ మీడియాలో నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను.’ అనే సుదీర్ఘ పోస్ట్ను షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమను ఉద్దేశించి పెట్టినదేనని టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.

దేవినేని ఉమా కేశినేని నాని ఇద్దరి మధ్య వివాదాలు ఉన్నాయి అని అంటుంటారు పార్టీ శ్రేణులు, ఇప్పుడు దేవినేని ఓటమి పాలైనా సరే ఆయనకు బాబు ప్రయారిటీ ఇవ్వడం కేశినేనిని పక్కన పెట్టడం ఇవన్నీ కూడా ఆయనను నిశ్శబ్ద పోరాటానికి దిగేలా చేశాయి. ఇక గల్లా జయదేవ్ వచ్చి బుజ్జగించినా చంద్రబాబు నాయుడు అండగా ఉంటాను అని చెప్పినా ఆయన మాత్రం తన విమర్శలు ఆపడం లేదు. ఇక ఆయన బీజేపీతో దోస్తికి సిద్దం అవుతున్నారు అని, కాని నేరుగా చేరే కంటే బాబు ఆయన పై వేటు వేస్తే ఈజీగా పార్టీ మారే ఆలోచనలో ఆయన ఉన్నారు అని సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.