రోజాకు ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి ప్రకటించిన జగన్

jagan-roja

ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు.. సీఎంగా ప్రమాణస్వీకారం తర్వాత ఆయన మంత్రి వర్గ కూర్పుపై బాగా దృష్టిపెట్టారు.. తర్వాత బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తూ ఆయన మంత్రి వర్గాన్ని సిద్దం చేసి కేబినెట్ రెడీ చేసుకున్నారు. ప్రమాణస్వీకారం కూడా పూర్తి అయింది. తొలి కేబినెట్ సమావేశం పూర్తి అయింది. అయితే మంత్రి పదవులు రాలేని సీనియర్లు మాత్రం అలకపాన్పుపై ఉన్నారు.. మరి జగన్ వీరికి ఇప్పటికే నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అని భావించారు.. తాజాగా జగన్ ఇలాంటి లిస్టులో ముందు ఉన్న ముగ్గురు నేతలకు కీలక పదవులు ఇవ్వాలి అని చూస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, నగరి ఎమ్మెల్యే రోజా, అంబటి రాంబాబు వీరికి ముఖ్యంగా పదవి ఇవ్వాలి అని చూస్తున్నారు జగన్.

ఇక నిన్న సీఎం జగన ఆర్కే తో- రోజాతో చర్చించారు.. అయితే రోజా కు జగన్ ఎలాంటి పదవి ఇస్తారు అని చర్చ జరుగుతోంది. ఆమెకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వనున్నారు అని వార్తలు వినిపించాయి. తాజాగా ఆమెకు కేబినెట్ హోదా ఉండే కీలక పదవి ఇచ్చారు జగన్..ఏపీలో ఆర్టీసీ చైర్మన్, పదవిని అంబటి రాంబాబుకు ఇచ్చేందుకు జగన్ ఆలోచించారట

ఇక ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు అని తెలుస్తోంది. ఓ పక్క అసెంబ్లీలో ప్రమాణస్వీకారం జరుగుతోంది. జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది..రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు,పెట్టుబడులను ఆకర్షించేలా మౌళిక వసతులు కల్పించడంలో ఈ కార్పొరేషన్ కీలక పాత్ర పోషిస్తుంది.. ఇక మిగిలిన నేతలకు కూడా , కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను ఇవ్వనున్నారు.. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ పోస్టుకు కేబినెట్ హోదా కూడా వస్తుంది. దీంతో వారిని కొంత వరకు సంతృప్తి పరచవచ్చని కూడా జగన్ భావిస్తున్నారట.ఇక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి కూడా కీలకమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వనున్నారట సీఎం జగన్.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.