జగన్ ఎంతో నమ్మాడు చివరకు ఇప్పుడు ఈ నాయకుడి పరిస్దితి

jagan-jupudi-prabhakar

వైయస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు తీసుకువచ్చి ఎంతో మంచి పేరు సంపాదించారు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు ఇప్పటికీ అందరూ చర్చించుకుంటారు. అసలు ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఆ పథకాలు కంటిన్యూ చేయాల్సిందే, ప్రజలకు అంత మంచి పాలన అందించారు ఆయన, అయితే పథకాలే కాదు నేతలకు కూడా అలాగే మంచి పదవులు కూడా ఇచ్చారాయన. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టి ఎంతోమందిని కీలక స్థానాల్లోకి తీసుకు వెళ్లారు అని చెప్పాలి. ఇక ఇలా ఓ నేత గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

ఇంతకీ ఆనేత ఎవరు అంటే, ప్రకాశం జిల్లాకు చెందిన జూపూడి ప్రభాకర్ రావు ఒకరు. జూపూడి ప్రభాకర్రావు వైఎస్ మరణానంతరం వైఎస్.జగన్కు నమ్మిన బంటుగా ఉన్నారు. ఆయన వెంటే నడిచారు పార్టీలో కీలక నేతగా ఉండేవారు. ఇక 2014 ఎన్నికల్లో జగన్ ఆయనకు కొండపి నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆయన ఓడిపోయారు. ఇక జిల్లాలో వైసీపీ మెజార్టీ స్ధానాలు గెలిచినా సరే ఆయన ఓటమి పాలయ్యారు. ఇక తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ఆయన. ఇక చంద్రబాబుని పొగుడుతూ టీడీపీలో కొనసాగారు. ఈ సమయంలో బాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు, అప్పటి వరకూ జగన్ వెన్నంటి ఉండి చంద్రబాబు పైన విమర్శలు చేసిన జూపుడి, ఒక్కసారిగా వైసీపీ ని వీడి టీడీపీలో చేరి జగన్ పై విమర్శలు చేశారు. ఇది అందరూ ఊహించని పరిణామం అయింది పార్టీలో.

ఇక నామినేటెడ్ పోస్టులు అన్నింటికి తెలుగుదేశం నేతలు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పదవులు వదులుకుంటున్నారు నేతలు. దీంతో జూపూడి తన పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన జూపూడి ఇప్పటివరకు అదే పార్టీలో కొనసాగి ఉంటే కచ్చితంగా ఎస్సీ కోటాలో ఆయనకు కీలకమైన మంత్రి పదవి దక్కేది. జగన్ కచ్చింగా ఆయనకే మంత్రి పదవి ఇచ్చేవారు అని అంటున్నారు పార్టీ శ్రేణులు.. అందుకే రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.