janampulse

డాక్టర్ గారి గెలుపు పక్కా డాక్టర్ కంటే జగన్ కే ధీమా ఉంది

Jagan confident on Palakollu seat

రాజకీయం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. చిన్న ఇన్సిడెంట్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ కూడా పెట్టెయ్యచ్చు. అయితే ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే పశ్చిమగోదావరి జిల్లాలో ఓ సెగ్మెంట్ గురించి చెప్పుకోవాలి. పాలకొల్లు కళాకారులకు ప్రసిద్ది. రాజకీయనేతలకు పుట్టిన ఇళ్లు, ఇక్కడ రాజకీయం కూడా ఎప్పుడూ రసవత్తరంగా జరుగుతుంది. అందుకే చిరంజీవి కూడా ఇక్కడ నుంచి పోటీ చేశారు. గెలుపు రాలేదు, అది వేరే సంగతి .ఇప్పుడు వైసీపీ టీడీపీ తెలుగుదేశం తరపున మూడు పార్టీలు పోటీ చేసిన సెగ్మెంట్లలో, టఫ్ వార్ ఏపీలో ఎక్కడ ఉంది అంటే పాలకొల్లు అని చెప్పాలి.

తెలుగుదేశం తరపున ఇక్కడ నిమ్మలరామానాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉన్నా విషయం అన్ని పార్టీలు ఒప్పుకునేది ఒకటే ,మనిషి చాలా మంచి వ్యక్తి ,30 ఏళ్ల నుంచి పాలకొల్లుకు ఎవరూ చేయని అబివృద్ది చేశారు అంటారు. పైగా రైతు బిడ్డగా అందరిలో ఉంటారు అంటారు,కాని కమీషన్లు తీసుకుంటారు అని విమర్శలు ఉన్నాయి. ఇవి జగన్ కూడా పాదయాత్రలో సంకల్పయాత్రల్లో ఎన్నికల శంఖారావంలో ఇదే మెయిన్ ఫోకస్ గా విమర్శలు చేశారు. అయితే అవన్నీ అసత్యాలు అని తెలుగుదేశం తరపున ప్రచారం రామానాయుడు చేశారు చంద్రబాబు కూడా ఎన్నికల సభ నిర్వహించారు, ఇక తప్పకుండా గెలుపు పక్కా అని అనుకున్న సమయంలో కేవలం ఎన్నికలకు ఒక 15 రోజుల ముందు సీన్ మొత్తం మారిపోయింది.

2014లో డాక్టర్ బాబ్జికి సీటు ఇవ్వకుండా రామానాయుడికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు.. ఇక బాబ్జి టీడీపీకి గుడ్ బై చెప్పి ఇండిపెండెంట్ గా నిలబడ్డారు. దీంతో భారీ మెజార్టీకి గండిపడింది. అంతేకాదు ఇక్కడ నుంచి నిలబడిన వైసీపీ అభ్యర్ది శేషుబాబుకి గెలుపుని దూరం చేసింది..ఇక సీటు కోసం ఆశలు పెట్టుకున్న గుణ్ణం నాగబాబు మరోసారి వైసీపీ తరపున సీటు తనకు వస్తుంది అని పార్టీ కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు. కాని పలు సర్వేల ద్వారా నాగబాబుకి గెలుపు రాదు అని విమర్శలు రావడంతో, సర్వేలు తేల్చడంతో జగన్ వెంటనే డాక్టర్ బాబ్జిని పార్టీలోకి తీసుకురావాలి అని చూశారు. ఇక అదునుచూసి కరెక్టుగా జగన్ ప్లాన్ వేశారు. వెంటనే బాబ్జి వైసీపీలో చేరిపోయారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్ , ఆయన వెనుక నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్ది కనుమూరి రఘురామకృష్ణంరాజు ఉన్నారు అంటారు ఇక్కడ నేతలు.

ఇక నాగబాబు చేసేది లేక వైసీపీకి రాజీనామా చేశారు .. వెంటనే జనసేనలో చేరిపోయారు.. అప్పటి వరకూ మాజీ ఎంపీ హరిరామజోగయ్య కుటుంబం నుంచి ఆయన కుమారుడికి ఎంపీ టికెట్ వస్తుంది అని అనుకున్నారు అందరూ.. ఇక నాగబాబు పరిస్దితి చూసి వెంటనే నాగబాబుకు సీటు ఇప్పించారు మాజీ ఎంపీ జోగ్యయ.. పవన్ బన్నీ నాగబాబు మొత్తం మెగా కుటుంబం ప్రచారం చేసింది .ఇక్కడ జనసేన కూడా మంచి టఫ్ ఫైట్ ఇచ్చింది అని చెప్పాలి.

వైసీపీ తరపున నిలబడిన బాబ్జీగారికి గెలుపు పక్కా అని అంటున్నారు ఇక్కడ నేతలు… ఆయన అవినీతి చేశారు అని ఏ ఒక్కరూ అనరు.. ఆ మంచి తనం ఆయనని మరోసారి ఎమ్మెల్యేని చేస్తుంది అంటున్నారు.. జగన్ కూడా రెండు సంవత్సరాలు ఆయన్ని పార్టీలోకి రావాలి అని పిలిచారు.. కాని ఆయనే తన ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికి అర్దరాత్రి వరకూ ట్రిట్మెంట్ చేసే డాక్టర్లు ఉన్నారు అంటే ఆ లిస్టులో ఈ డాక్టర్ బాబ్జి ఉంటారు. ఆయనకు నేరుగా జగన్ ఫోన్ చేసి మీరు గెలుస్తారు నో డౌట్ అని అంటున్నారు అంటే ఆయనకు ఉన్నా పేరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇదే పెద్ద మైనస్ గా మారిపోయింది. పార్టీలో ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతున్న క్రమంలో డాక్టర్ గారి ఎంట్రీ వైసీపీ తరపున పెద్ద మైనస్ అని టీడీపీ నేతలు వారిలో వారే మదనపడుతున్నారు. దీనిపై చర్చ కూడా జరుగుతోంది పాలకొల్లు టౌన్ లో. సో అది క్షిరపురి పొలిటికల్ అప్ డేట్.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.