కొత్త జిల్లాల పై జగన్ మదిలో ఏముంది

వైయస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హమీలు అన్నీ ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నారు, అయితే అందులో సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అనే అంశం హమీ కూడా ఉంది. మరి జగన్ ఈ కొత్త జిల్లాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అనే టాక్ అప్పుడే ఏపీలో స్టార్ట్ అయిపోయింది.

చాలా మంది కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు కూడా. ఎందుకంటే బిజినెస్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా, ఉద్యోగాల కల్పన పరంగా కొత్త జిల్లాల ఏర్పాటు చాలా మార్పులు తెస్తుంది. ముఖ్యంగా రాజకీయంగా కూడా అవకాశాలుపెరుగుతాయి అని నేతలు చూస్తున్నారు, అయితే తాజాగా ఏపీ రాజకీయాల పరిస్దితులు చూస్తుంటే ఇప్పుడు జగన్ ఈ కొత్త జిల్లాల అంశాన్ని కొద్ది రోజులు పక్కన పెడుతున్నారు అని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26న కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలి కాని ఆరోజు అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు అంటే నేతల కోరికలు ప్రజల కోరికలు ఇలా చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. ఎలాంటి సమస్యలు రాకుండా చేయాలి. అందుకే జగన్ ఆ ప్రాసెస్ ని పక్కన పెడతారట. ఇంకా కొన్ని గ్రామాలు మండలాల్లో విలీనం అవ్వాలి,మండల కేంద్రాలలో కొన్ని గ్రామాలు కలిపే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దీనిని పూర్తి చేసి తర్వాత జిల్లాల ఏర్పాటు ముందుకు తీసుకురావాలి అని జగన్ ఆలోచన.

ఇక పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఈ జిల్లాల విభజన ఉంటుంది అని తెలుస్తోంది, దీనిపై కమిటీ వేయాలి .వారు నివేదిక ఇవ్వాలి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు ఇలా అన్నీ సానుకూలంగా జరిగితే రెండు నెలలు లేదా 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది అంటున్నారు అధికారులు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.