janampulse

జ‌గ‌న్ నిర్ణ‌యం బాగుంది – య‌న‌మ‌ల‌

yanamala ramakrishnudu comments on YS Jagan

ప్ర‌భుత్వం పై నిత్యం విమ‌ర్శ‌లు చేసే నాయ‌కులు కాస్త ప‌రిస్దితి బాగోని స‌మ‌యంలో విప‌త్తులు ఆర్దిక అస్తిర‌త ఉన్న స‌మ‌యంలో ఆలోచించాలి… ఈ క‌రోనా స‌మ‌యంలో కూడా దీనిని రాజ‌కీయాల‌కు ముడిపెట్టే విష‌యంలో కొంద‌రు నేత‌లు ఉంటున్నారు.. చేస్తే సాయం చేయాలి లేక‌పోతే గ‌మ్మునుండాలి అనేది ప్ర‌జ‌లు చెప్పేమాట.. అయితే తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు మాజీ సీఎం కూడా ప‌లు విమ‌ర్శ‌లు సీఎం జ‌గ‌న్ పై చేశారు.

Also Read: తెలంగాణలో 9కి చేరిన మృతుల సంఖ్య: ఒక్క రోజే 30 కొత్త కరోనా కేసులు

ఇక తెలుగుదేశం లో నెంబ‌ర్ 2గా ఉన్న య‌న‌మ‌ల తాజాగా సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ఱ‌యం బాగుంది అని అన్నారు.ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ, ఈ కరోనాని అడ్డుకోడానికి నిధులను కూడా సమకూర్చుకుంటుంది ఏపీ ప్ర‌భుత్వం ఈ విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

అంతేకాకుండా ఈ అవసరాల నిమిత్తం ప్రస్తుత ఆర్థిక కష్టాలను ఉద్యోగులందరూ కూడా అర్థం చేసుకొని, అందరు కూడా తమ వంతుగా సహకరించాలని చెబుతున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఈ భయంకరమైన కరోనా వైరస్ కారణంగా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్న తరుణంలో సీఎం జగన్ చేసిన వాఖ్యలపై కొద్దిగా విమర్శలు కూడా చేశారు టీడీపీ నేత రామకృష్ణుడు… మొత్తానికి ప్ర‌జ‌లు భ‌యానికి లోను కాకుండా సీఎం జ‌గ‌న్ నిన్న మాట్లాడారు అని దీనికి రాజ‌కీయాలు ఆపాదించ‌క్క‌ర్లేదు అంటున్నారు మేధావి వ‌ర్గం.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.