లక్ష్మీ పార్వతికి కీలక పదవి ఇచ్చిన సీఎం జగన్

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్ వినిపించిన నేతలు అందరికి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవులు ఇస్తున్నారు. కొందరికి మంత్రి పదవులు ఇస్తే, మరికొందరికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అయితే తాజాగా పార్టీ వాయిస్ వినిపించే లక్ష్మీ పార్వతికి జగన్ సర్కారు నామినేటెడ్ పదవిని కట్టబెట్టింది. దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మీ పార్వతిని తెలుగు అకాడమీ చైర్పర్సన్గా నియమిస్తూ జీవో జారీ చేసింది. అయితే గడిచిన నెల రోజులుగా ఆమెకు కీలక పదవి రానుంది అని వార్తలు వినిపించాయి. దీంతో ఇప్పుడు జగన్ సర్కారు జీవో జారీచేయడంతో ఆమె అభిమానులు ఆనందంలో ఉన్నారు.

ఇక గడిచిన ఎన్నికల్లో వైసీపీ వాయిస్ బలంగా వినిపించారు ఆమె, ఏపీలో జగన్ అలాగే వైసీపీ తలపెట్టిన ప్రతీ కార్యక్రమంలో ఆమె పాల్గొనేవారు. బాబుపై నిప్పులు చెరిగే ఆమెని రాజ్యసభకు కూడా పంపిస్తారు అని వార్తలు వచ్చాయి. అలాగే ఎమ్మెల్సీ కూడా వస్తుంది అని అన్నారు. కాని ఆమెకు సరైన పదవి ఇదే అని జగన్ భావించి తెలుగు అకాడమీ చైర్పర్సన్గా పదవిని ఇచ్చారు.

గత ఎన్నికల సమయంలో ఆమె వ్యక్తిత్వం పై కూడా చాలా దారుణమైన విమర్శలు వచ్చాయి… ఇదంతా టీడీపీ ఆడిన కుట్ర అని ఆమె మీడియా ముఖంగా విమర్శించారు. చివరకు ఆమెపై నిందలు వేసిన వారి జాతకాలు తర్వాత బయటపడ్డాయి, చాలా రోజులుగా పార్టీలో కీలక నాయకురాలిగా ఉన్న ఆమెకు జగన్ ఈ పదవి ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.