
జగన్ యధార్ధ వాది ప్రతిపక్షానికి విరోధి
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తుమ్మినా దగ్గినా తప్పే, అసలు ప్రెస్ మీట్ పెట్టినా తప్పే, ప్రజలకు సేవ చేసినా తప్పే, అసలు సీఎం కుర్చీలో కూర్చోవడం ఇష్టం లేని ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలు ఆరోపణలు దేశంలో ఏ ప్రతిపక్షం చేయడం లేదు.. అన్నీ రాష్ట్రాల్లో విపక్షాలు చేస్తే సాయం చేస్తున్నాయి, లేదా గమ్మున వారికి తోచిన సాయం చేస్తున్నాయి, ఈ సమయంలో రాజకీయాలు మాత్రం చేయడం లేదు, పైగా పక్క రాష్ట్రం వెళ్లిపోయి రెస్ట్ తీసుకుంటున్న చంద్రబాబు అది డైవర్ట్ అవ్వడానికి సర్కారుపై విమర్శలు చేస్తున్నారు.
Also Read వైసీపీ వంతు అయింది గంటాపై బీజేపీ టార్గెట్
చేసేది చెప్పడం జగన్ స్టైల్…. చెప్పింది చేయకపోవడం బాబు స్టైల్… అదే ఇప్పుడు జగన్ కు కాస్త చేటు తెస్తోంది, నిజాలు చెబితే సమస్యలు వస్తాయి అంటారు అందుకే యధార్ధవాది లోక విరోధి అంటారు, కాని ఇక్కడ జగన్ చెప్పిన మాటలకు ప్రతిపక్షానికి విరోధి అవుతున్నారు, అంతేకాని ప్రజలకు కాదు. మనం ఇంత బాధపడుతున్న ఈ వైరస్ కి అంటే …ఈ కరోనాకు మందు లేదు.
అందువల్ల దానితోనే సహజీవనం చేయాలని, బయటకు వెళ్ళినపుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని కూడా సూచించారు సీఎం జగన్. ..నిజమే ఎప్పుడు ఎవరు తుమ్మినా దగ్గినా ఇక టెన్షన్ వస్తుంది.. వారి పక్క నుంచి దూరం జరిగే స్దితి వస్తోంది,లాక్ డౌన్ ఎత్తివేసినా మరో రెండు సంవత్సరాలు అందరూ ఈ టెన్షన్ లో ఉంటారు. మరి వాక్సిన్ లేని జబ్బు కావడంతో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే మనకుశ్రీరామరక్ష అని చెప్పారు సీఎంజగన్.
దీనిని కూడా ప్రతిపక్షం నానాయాగీ చేస్తోంది ఇదే విషయం డబ్లూహెచ్ వో చెప్పింది, అలాగే ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారు, నా సలహాలు తీసుకోవడం లేదు అని బాధపడుతున్న చంద్రబాబు, ఏం సలహాలు ఇస్తారో తెలియదు, మీడియా ముందు ఆ సలహాలు ఇవ్వచ్చు కదా వద్దు అనేవారు ఎవరు.. పోని డాక్టర్ల కంటే తెలివిగా మందు కనిపెడతారా, ఈ వైరస్ ని ఏమైనా శక్తితో ఆపేస్తారా, ఎవరైనా వద్దు అన్నారా, చేతకాకపోతే దిగిపోండి అని విమర్శించడం ఏమిటి, మరి ముందు చూపుతో తుఫాన్లు ఆపచ్చు కదా, ఆనాడు ఉత్తరాంధ్రాని తుఫాను బారి నుంచి కాపాడచ్చు కదా, అప్పుడు మీరు ఎందుకు చేతకాని వాడిలా ఉన్నారు, అది ప్రకృతి అంటారు, మరి ఇది అంతే చైనా నుంచి వచ్చిన వైరస్ ఇక్కడ పుట్టింది కాదు కదా..
జగన్ చెప్పిన దానిలో ఆలోచిస్తే మనం దీనితో ప్రయాణించాల్సిందే అన్నారు, చాలా మంది మేధావులు ఇది కరెక్ట్ అంటున్నారు, ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేయగానే వైరస్ ఏమీ పోదు కదా, ఇంకా కొన్ని కేసులు ఉండవచ్చు కదా, తెలుగుదేశం చేసే చిల్లర రాజకీయాలపై ప్రజలకు విసుగు వస్తోంది, వారికి బాకాలు ఊదే మీడియాలపై కూడా ప్రజలకు చికాగు పుడుతోంది. రాజకీయ విమర్శలకు ఇది తగిన సమయం కాదు అంటున్నారు జనం.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్