
ఎల్వీ సుబ్రమణ్యంకు జగన్ సర్కార్ వెసులుబాటు
ఏపీలో మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం అందరికి తెలిసిన వ్యక్తే, సీఎం జగన్ కు పలు సలహాలు ఇస్తూ సీఎస్ గా తొలిసారి ఆయనే ఉన్నారు, అయితే కొన్ని కారణాలతో ఆయనను సీఎస్ పదవి నుంచి తొలగించింది ఏపీ సర్కార్, తాజాగా ఆయనకు సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. ఏపీ మాజీ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉద్యోగ విరమణకు సంబంధించి వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది.
Also Read సీతక్క స్టైలే వేరు: లాక్ డౌన్ లో అలుపెరుగని నేత.
నేడు ఏప్రిల్ 30 పదవీ విరమణ చేయాల్సిన ఆయన, ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన పదవీ విరమణ చేసేలోగా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి శిక్షణా సంస్థ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి, ఆపై రిటైర్ అయ్యేలా చూడాలని, తద్వారా రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఆయన కోల్పోకుండా చూడాలని ప్రభుత్వం భావించింది.దీనికి కారణం ఆయన ఇప్పటి వరకూ ఆ బాధ్యతలు తీసుకోలేదు.
ఇక లాక్ డౌన్ వేళ ఆయన ఇప్పటికిప్పుడు చివరి రోజు తీసుకునే సమయం లేదు, ఈ సమయంలో సర్కార్ ఆయనకు వెసులుబాటు ఇచ్చింది.. ఆన్ లైన్ ద్వారా ఆయన బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి శిక్షణా సంస్థ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత సాయంత్రం రిటైర్డ్ అవుతారు, ఇక ఎల్వీని గత ఏడాది నవంబర్ లో సీఎస్ నుంచి సర్కార్ తొలగించింది. తర్వాత తన ఉద్యోగానికి సుదీర్ఘ సెలవు పెట్టారు. ఇక ఆరునెలలు సమయం ఉండటంతో ఆయన లాంగ్ లీవ్ పెట్టారని అందుకే బాధ్యతలు తీసుకోలేదు అని అన్నారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్