ఎల్లో మీడియా చెత్తపలుకులపై జగన్ సీరియస్

రాజకీయ నాయకులకి బాకాలు పలికే మీడియాలు ఉన్నంత వరకూ, ఈ సమాజంలో ఇలాంటి అక్కసు దోరణి కక్షపూరిత పగ ప్రతీకార వ్యవహారం కథనాల రూపంలో వస్తూనే ఉంటుంది.. ఒక కులానికి ఒక మతానికి నాయకులని సెంటర్ చేసేలా మీడియా ఎప్పుడూ వ్యవహరించకూడదు, గాలి వార్తలు సోషల్ మీడియాలో రావాలి, అంతేకాని ఇలా పత్రికలు శాటిలైట్ల మీడియాలలో రాకూడదు, ఊహా కథనాలు రాయడానికి ఇవేమైనా చందమామ కథలా ,వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి కాని బాబుకి భజన చేసే మీడియా ప్రతీ వారం పలికే చెత్తపలుకులు, ఈసారి మరింత దారుణాతి దారుణంగా ఉన్నాయి.

విలువలకు తిలోదలకాలు వదిలారు అనేలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి క్రిస్టియన్లు అనే లింక్ కలుపుతూ ఓ కథనం వదిలారు. సిగ్గుతో తలదించుకోవాలి. కులాల కుంపట్లు ఉండకూడదు అని రాజకీయంగా ముందుకు వెళుతుంటే ఈ కుళ్లు మీడియా క్షుద్ర మీడియా సీఎంపై ఇలాంటి వార్త రాయడం ఎంత దారుణం, నిజంగా తెలంగాణలో కులాల గోల లేదు అని చెప్పే ఈ పెద్దమనిషి ,ఏపీలో నిత్యం కులాల కోట్లాట ఉంటుంది అంటాడు, అలాగే జగన్ కు ఈ కులాలకు కలుపుతున్నాడు.

ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు గంపగుత్తగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటున్నారు అని, మరింత మందిని ఆ మతంలోకి మార్చి తన రాజకీయాల కోసం జగన్ ఎత్తులు వేస్తున్నాడు అని వార్త రాశాడు. కావాలని క్రీస్టియన్లను కించపరిచేలా ఈ వార్తలు రాయడంపై ఆ సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి వారి మీడియాలు నిజంగా చూడకూడదు అని చెబుతున్నారు, దీనిపై సీఎంవో సీరియస్ గా ఉందట ఇప్పటికే తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తాం అన్నారు జగన్. మరి దీనిపై కూడా కీలక డెసిషన్ తీసుకుంటారట.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.