మోదీని కలిసిన జగన్ -ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

modi-jagan

వైయస్ జగన్ దిల్లీ వెళ్లారు. రెండోసారి భారీ మెజార్టీతో గెలిచిన ప్రధాని నరేంద్రమోదీని ఆయన కలిశారు.. ఆయనతో పాటు వైసీపీ ఎంపీలు కూడా ఉన్నారు. జగన్ విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి ఇలా పలువురు నేతలు జగన్ వెంట ఉన్నారు.. జగన్ ప్రధాని నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలియచేశారు .ఆ సమయంలో జగన్ కు మోదీ కూడా శుభాకాంక్షలు తెలియచేశారు. ఇద్దరూ కూడా ఆలింగనం చేసుకున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఇద్దరూ పలు ఏపీ సమస్యలపై చర్చించారు. జగన్ ఏపీ ఆర్దిక పరిస్దతి గురించి బడ్జెట్ గురించి తెలియచేశారు.

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇదే సమయంలో రాష్ట్ర సమస్యలపై ప్రధానితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో జగన్ వెంట పలువురు అధికారులూ ఉన్నారు. కాగా, ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఏపీ భవన్లో అధికారులతో జగన్ భేటీ కానున్నారు. ఇక పలువురు కీలక నేతలతో జగన్ నేడు భేటీ అవుతారు అని తెలుస్తోంది.

ఇక హస్తినలో పలువురు ఉన్నత అధికారులు ఏపీ భవన్ అధికారులతో జగన్ భేటీ అవుతారు.. అలాగే రాజ్ నాథ్ అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది, ఇక తెలుగువారు జగన్ అభిమానులు ఇక్కడ పెద్ద సంఖ్యలో జగన్ ను కలిసేందుకు సిద్దంగా ఉన్నారు, రేపు ఉదయం ఆయన హస్తిన పర్యటన నుంచి అమరావతి రానున్నారు అని తెలుస్తోంది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.