బాబుకు అద్దె ఇళ్లు కావలెను జగన్ వదలడు

Jagan will not leave Babu for rent

చంద్రబాబు నిర్మించిన కలల ప్రజావేదిక నేలమట్టం అయింది అనేది తెలుగుదేశం నేతలు చెబుతున్న మాట.. అయితే వాస్తు ఎలా ఉన్నా నేడు అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా నేలమట్టం కావాల్సిందే, అందుకే జగన్ సీఎం అయిన తర్వాత ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నివాసం ఇప్పుడు చర్చకు దారితీసింది ఇక ప్రజావేదిక పక్కన ఉన్న ఈ లింగమనేని గెస్ట్ హౌస్ అదే బాబు నివాసం పరిస్దితి ఏమిటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ అద్దె చెల్లించేది ప్రభుత్వం మరి ప్రతిపక్ష నేత మాజీ సీఎం నివాసం కూల్చేస్తే ఎలాగ అనే డైలమా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది.

ఇప్పుడు దాన్ని ఖాళీ చేసి, వేరేగా అద్దె ఇంట్లోకి వెళ్లాల్సి వస్తోంది. కారణం అది కృష్ణానది కరకట్ట మీద కట్టిన అక్రమ కట్టడం కావడమే. అవును తెలుగుదేశం పార్టీకి ఈవిషయం తెలిసినా సరే, ముందుకు వచ్చింది. చంద్రబాబు ముచ్చటపడీ మరీ ఇంటీరియర్ చేయించుకున్నారు. అంతా ప్రభుత్వ సొమ్ము ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ము. ఇక ప్రభుత్వం నుంచి ఆఇంటికి అద్దె కూడా చెల్లించేవారు.. అంటే ప్రభుత్వమే అక్రమంగా ఉన్న ఇంటికి అద్దె ఇస్తుంది అంటే ఇది నిజంగా దేశంలో ఓ చరిత్ర అనే చెప్పాలి. బాబుగారి పాలన ఐదు సంవత్సరాలు ఎలా కొనసాగింది అనడానికి ఇది ఓ ఉదాహరణ.

పేరుకి ప్రజావేదిక కేవలం అది ఓ అతి పెద్ద రేకుల షెడ్డు. దానికి బయట ఎలివేషన్. లోపల్ డెకరేషన్ చివరకు కూల్చేసింది సర్కారు. ఇక బాబుకు ఇప్పటికే మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే లాంటి నేతలు చెబుతున్నారు .. మర్యాదగా ఖాళీ చేసి ఆ ఇంట్లో వెళ్లిపోతే బెటర్ అని ఈ వ్యాఖ్యలు చూస్తేంటే ఈ వారంలోనే ఆ ఇంటికి కూడా ముహూర్తం పెట్టారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.. అందుకే చంద్రబాబు కూడా ఆ ఇంటిని వీలైనంత తొందరగా ఖాళీచేసి అద్దె ఇంటికి అదే మరో అద్దె ఇంటికిషిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారట..గుంటూరు అమరావతి ప్రాంతంలోని మంచి రిచ్ లోకేషన్ లో ఇల్లు కావాలని, అవసరం అయినపుడు సులువుగా ఎయిర్ పోర్టుకు అమరావతికి సులువుగా వెళ్లడానికి వీలుగా వుండే లొకేషన్ అయితే బెటర్ అని సూచన ఇచ్చినట్లు బోగట్టా.

చంద్రబాబు జగన్ ని హైదరాబాద్ లో ఉంటున్నావు అని విమర్శించాడు, పాపం అమరావతిలో ఐదేళ్లు అధికారంలో ఉన్నా 40 వేల ఎకరాల పొలాలు రైతుల నుంచి తీసుకున్నా, ఒక్క10 సెంట్ల స్ధలంలో చిన్న ఇళ్లు మాత్రం సొంతంగా నిర్మించకపోవడం అనేది ఆలోచించాల్సిన అంశమే.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.