జగన్ మొదటిటార్గెట్ ఇదే అందరికి పిలుపు

Jagan's FirstTarget calls this all

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోయేలా అద్బుతమైన విజయం సాధించింది. ఈ విజయం అందించిన ప్రజలు పార్టీ కార్యకర్తలు శ్రేణులు అందరికి ఆయన అభినందనలు తెలియచేశారు. ఇక జగన్ విశ్వసనీయతకు ప్రజలు ఓటేశారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైసీపీ అండగా నిలిచిందన్నారు. వైసీపీ శాసనసభపక్ష నేతగా జగన్ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమయంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ శ్రేణుల వద్ద. మనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు అందుకే ఇంత బంపర్ మెజార్టీ ఇచ్చారు, మన పార్టీపై నమ్మకం పెట్టుకున్నారు కాబట్టే 151 స్ధానాల్లో గెలిచాం అని అన్నారు జగన్.

మనం బాధ్యతతో ముందుకు వెళ్లాలి. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పనిచేస్తాం. 2019 అయిపోయింది.. మన టార్గెట్ 2024. 2024లో ఇంత కన్నా గొప్పగా మనం గెలవాలి. రాష్ట్రంలో ప్రక్షాళనకు మీ సహకారం కావాలి. అక్రమాలు చేస్తే దేవుడు ఎలా మొట్టికాయలు వేస్తాడో చూశాం. చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 23. చివరకు చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యే సంఖ్య కూడా 23. దేవుడు అంత గొప్పగా స్క్రిప్టు రాశాడు’’ అని జగన్ వ్యాఖ్యానించారు. ఇక ఇలాంటి నేతలు ఎవరూ కూడా ఇలాంటి చర్యలకు సాహసం చేయరు పార్టీ ఫిరాయింపులు ఎలాంటి రిజల్ట్ ఇచ్చాయో ఇప్పుడు చూశారు, మన ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం అని చెప్పారు జగన్.

దీంతో కొత్తగా ఎన్నికైన అభ్యర్దులు అందరూ కూడా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేశారు. వైసీపీ శాసనసభాపక్ష నేతగా జగన్ను ఆపార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. జగన్ నివాసంలో సమావేశమైన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చీపురుపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, జగన్ను శాసనసభాపక్ష నేత ప్రతిపాదించారు. బొత్స ప్రతిపాదనను ఎమ్మెల్యేలు ధర్మాన, ఆదిమూలపు సురేష్, పార్థసారధి బలపరిచారు. నేడు సాయంత్రం గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పిలవనున్నారు జగన్.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.