janampulse

ఎన్నికల్లో పోటీకి రెడీ కాని మెలిక పెట్టిన పవన్

Janasena about telangana municipal elections

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కరీంనగర్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 పురపాలికల్లోని 325 కార్పొరేటర్, 2,727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈరోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
11వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు.
ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరించుకోవచ్చు సమయం అప్పటి వరకూ ఉంది.
ఈనెల 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్
ఈనెల 25న ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఇక తెలంగాణలో మూడు పార్టీలు పోటికి సిద్దం అయ్యాయి, బీజేపీ టీఆర్ ఎస్ , కాంగ్రెస్ ..తాజాగా తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు… అయితే తమ అభ్యర్థులు పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటీచేయడం లేదన్నారు.. ఈ మేరకు వివరాలతో జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది..

కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా జనసేన ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుతో పోటీచేయడం లేదని వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుందని చెప్పారు పవన్ .. తెలంగాణలో ఆసక్తి ఉన్న వారు స్వంతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సి ఉంటుందని సూచించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దీనికి అనుమతినిచ్చారని పార్టీ ప్రకటనలో తెలిపింది.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.