janampulse

డబ్బు పంచి అధికారంలోకి వచ్చారు , మా ఎమ్మెల్యేను లాక్కోవాలని చూస్తారా: జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్

Janasena Chief Pawan Kalyan fires on YSRCP Government

జనసేన పార్టీకి ఉన్న ఒక్క ఎహ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని పవన్ ఆరోపించారు. అందువల్లే రాపాక వరప్రసాదరావుపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. తనను రెచ్చగొట్ట వద్దని పవన్ హెచ్చరించారు. రెచ్చగొడితే ఎంతవరకు అయినా పోరాడతానని పవన్ అధికార పార్టీకి హెచ్చరించారు. జనసేన అధినేత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏలూరు లోక్ సభ స్థానం పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

సమీక్ష లో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి గురించి స్థానిక నేతల నుండి ఆరా తీసారు. అనేక మంది నేతలు వైసీపీ పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేసిందని పవన్ కు వివరించారు. సామాజిక సమీకరణాల్లోనూ వైసీపీ ముందుందని అందుకే నెగ్గిందని వివరించారు. ఎన్నికల కు పూర్తి స్థాయిలో సమాయత్తం కాకవపోవటం ఓటమికి కారణంగా కొందరు నేతలు వివరించినట్లు సమాచారం. ఇదే సమావేశంలో పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్నికల ముందు పని చేయటం కాదని.. పార్టీ స్థాపించిన తరువాత.. ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన మూడేళ్ల క్రితం నుండే పోరాటాలు చేస్తే గెలిచి ఉండే వాళ్లమని పవన్ వ్యాఖ్యానించారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. డబ్బు పంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. డబ్బు పంచి ఉంటే జనసేన కూడా మంచి స్థానాలే గెలిచేదని చెప్పుకొచ్చారు. 

ఎన్నికల సమయంలో డబ్బులు పంచటం వైసీపీకే సాధ్యపడిందని..అందుకే వారు అధికారంలో ఉన్నారంటూ జనసేన అధినేత పవన్ సంచలన కామెంట్ చేసారు. అసలు వైసీపీ అధినేతకు జనసేన అంటే ఎందుకు కక్ష్య అని ప్రశ్నించారు. తమకు ఉన్ని ఒక్క ఎమ్మెల్యేను తమ వైపు లాక్కొనేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యే రాపాక మీద అనేక కేసులు నమోదు చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదని పవన్ ప్రశ్నించారు.

అదే సమయంలో వైయస్ వివేకా హత్య గురించి పవన్ ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో వేగం ఎందుకు లేదంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పరోక్షంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన ఆరోపణలకు దగ్గరగా పవన్ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది. అయితే, ఏపీలో తొలి సారిగా వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత ఈ స్థాయిలో వైసీపీ మీద.. ఎన్నికల్లో గెలుపు మీద ఇంత సీరియస్ గా కామెంట్లు చేసారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.