జనసేనకు రాజీనామా దసరాకి వైసీపీలోకి ఎంట్రీ

Janasena leader Akula Satyanarayana joining to YSRCP

జనసేన పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు, ఇక జనసేన ఎలా ముందుకు వెళుతుంది అనే ప్రశ్న సొంత పార్టీ నేతలకు వచ్చేలా ఉంది.. కొందరు అయితే మరో ఐదు సంవత్సరాలు పోరాటం చేయలేము అంటుంటే, మరికొందరు పార్టీ పైకి వచ్చేలా కనిపిచండం లేదు అంటున్నారు. ఈ సమయంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పారు.

జనసేన పార్టీకి రాజీనామా చేశానని, తన రాజీనామా పత్రాన్ని శనివారం పార్టీ అధిష్టానానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ భవిష్యత్పై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. ఆయన వైసీపీలో చేరడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. ఆయన పొలిటికల్ లైఫ్ చూస్తే. సత్యనారాయణ 2014 ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం బీజేపీ తరపున టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. ఆ సమయంలో ఆయన మంత్రి అవుతారు అని అనుకున్నారు , కాని ఆయనకు కాకుండా మాణిక్యాలరావుకి మంత్రి పదవి వచ్చింది.. తర్వాత 2019 ఎన్నికల సమయంలో ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు.

రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇక ఆయన వైసీపీలో చేరితే పార్టీకి మరింత పట్టు ఉంటుంది అని భావిస్తోంది పార్టీ, వైసీపీ రాజమహేంద్రవరం రూరల్ ఇన్చార్జిగా నియమించడంపై చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఆయన మరో నాలుగు రోజుల్లో పార్టీలో చేరే అవకాశం ఉందట, దసరా ముందే చేరే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.