
జనసేన నేతలు అండగా నిలిస్తే అరెస్టులా?… ‘TTD వారికి న్యాయం చేయాలి
Chittoor జిల్లాలో జనసేన నేతల అరెస్టులను ఆ పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఖండించారు. కార్మికుల దీక్షలను భగ్నం చేసేలా పోలీసు
చిత్తూరు జిల్లాలో జనసేన నేతల అరెస్టులను ఆ పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఖండించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధీనంలో పని చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికుల విధులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పోరాడుతుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. కార్మికుల దీక్షలను భగ్నం చేసేలా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి నుంచి కార్మికులను, మహిళలను అరెస్టులు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. వేల మంది కార్మికుల పోరాటానికి అండగా నిలిచిన జనసేన నాయకులను సైతం కట్టడి చేసేందుకు అదుపులోకి తీసుకుంటున్నారని చెప్పారు. ఈ చర్యలు అప్రజాస్వామికమని.. తమ డిమాండ్లను, బాధలను తెలియచేస్తూ ఆందోళనలు చేపట్టడం ప్రజాస్వామ్యంలో భాగమన్నారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
టీటీడీ కార్మికులకు అండగా నిలిచిన జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పగడాల మురళీ, పార్టీ నాయకులు మధుబాబు, రాజారెడ్డి, మనోహర్ దేవర తదితరులను అరెస్టు చేశారని నాదెండ్ల తెలిపారు. కార్మికులు గత 14 రోజుల నుంచి పోరాటం చేస్తుంటే జనసేన నాయకులు, జన సైనికులు అండగా నిలిచారని ఆయన అన్నారు. సొసైటీలుగా ఏర్పడి కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వర్తిస్తుంటే ఇప్పుడు వారిని రోడ్డు మీదకు తెచ్చారని మండిపడ్డారు. శ్రామిక చట్టాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న టీటీడీ తక్షణమే తన నిర్ణయాలను పునరాలోచించుకొని కార్మికులకు, ఉద్యోగులకు న్యాయం చేయాలని నాదెండ్ల కోరారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్