janampulse
Breaking News

మూడు రోజుల పాటూ, వైసీపీతో పాటూ టీడీపీ కూడా…మళ్లీ రంగంలోకి పవన్ కళ్యాణ్

జనసైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు. 18న ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎంపీలకు ట్యాగ్‌ చేసే డిజిటల్‌ క్యాంపెయిన్‌ ప్రారంభిస్తున్నామని తెలిపారు. లోక్‌ సభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన పార్లమెంట్‌ సభ్యుడికి, రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు ట్యాగ్‌ చేయాలని సూచించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరోసారి రంగంలోకి దిగారు. గత ఆదివారం దీక్షకు దిగిన జనసేనాని.. తాజాగా డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించారు.  జనసేన Party తరఫున ఈ నెల 18,19,20న ఈ క్యాంపెయిన్‌ చేపడదామని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్నిబలంగా ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.

వైఎస్సార్‌సీపీ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నా ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గళం విప్పకపోగా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో ఉందని ఆరోపించారు. వారికి బాధ్యతను గుర్తు చేయాలన్న లక్ష్యంతో డిజిటల్‌ క్యాంపెయిన్‌‌ ప్రారంభించి.. వైఎస్సార్‌సీపీతో పాటూ టీడీపీ ఎంపీలు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లోనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ గురించి మాట్లాడాలన్నారు. ఈ బాధ్యతను వారికి తెలియచేసేలా రాష్ట్రానికి చెందిన లోక్‌ సభ, రాజ్యసభ సభ్యులను ట్యాగ్‌ చేయాలన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడంతోపాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్షు అనే విషయాన్ని పార్లమెంట్‌కు తెలియ చేయాలని ఎంపీలను సోషల్‌ మీడియా ద్వారా కోరదామన్నారు. 18న ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎంపీలకు ట్యాగ్‌ చేసే డిజిటల్‌ క్యాంపెయిన్‌ ప్రారంభిస్తున్నామని తెలిపారు. లోక్‌ సభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన పార్లమెంట్‌ సభ్యుడికి, రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు ట్యాగ్‌ చేయాలని సూచించారు. జై తెలంగాణ అనగానే తెలంగాణ మొత్తం ఎలా మారుమోగుతుందో అలాంటిదే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం కూడా అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలసి రావాల్సిన సమయమని.. రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటి వరకు అలా ఏ రాజకీయ పార్టీ కలసి రాలేదన్నారు. రాజకీయ క్షేత్రంలో పార్టీల మధ్య విబేధాలు ఉన్నా.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ప్రతి ఆంధ్రుడి కర్తవ్యమన్నారు.

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. వారితో కలిసి నడవటానికి తాము సంసిద్ధతతో ఉన్నామన్నారు. అడగందే అమ్మయినా పెట్టదని.. రాష్ట్ర సమస్యలు, కష్టాలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లకపోతే తప్పు చేసిన వాళ్లమవుతామన్నారు. జనసేన పక్షాన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ని ప్రైవేటీకరించవద్దు అనే నినాదాన్ని ఇస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తామన్నారు. కార్మికులు, కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జనసైనికులు ముందుకు తీసుకెళ్లాలని కోరారు.. ఎంపీలకు వారి బాధ్యతను గుర్తు చేయాలని పిలుపునిచ్చారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.