janampulse

ఎమ్మెల్యే స్ధాయి నుంచి కౌన్సిలర్ కు జేసీ బ్రదర్

Jesse Brother from MLA to Counselor

తాడిపత్రిలో మా కుటుంబానికి తిరుగులేదు అని చెబుతారు జేసీ బ్రదర్స్ …కాని ఇవి మాటలు మినహా మరేమీ కాదు అని ప్రజలు తేల్చారు.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జేసీ కుటుంబానికి షాక్ ఇచ్చారు.. జేసీ బ్రదర్స్ రాజకీయ వారసులని ఎన్నికల్లో దింపి రాజకీయంగా వెనక ఉన్నారు.. కాని అక్కడ ప్రజలు మాత్రం ఇద్దరిని ఓడించారు.. ఈ ఓటమికి చంద్రబాబు కారణామా టీడీపీ కారణామా లేదా జేసీ బ్రదర్స్ రాజకీయాలు జనాలకి నచ్చలేదా అనేది అందరూ చర్చించుకున్నారు.

అయితే ఎన్నికలకు ముందు జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ మావాడే అని కామెంట్ చేశారు.. కాని అక్రమంగా బస్సులు నడుపుతున్నారు అని సీజ్ చేయడంతో పలు కేసులు నమోదు అవ్వడంతో మళ్లీ జేసీ జగన్ పై తీవ్ర విమర్శలుచేశారు, అలా అనంతపురం జిల్లాలో వెలుగు వెలిగిన జేసి చివరకు ప్రతిపక్ష టీడీపీలో ఉండాలా వద్దా అనే డైలామాలో ఉన్నారు.
ఇక ఆయన సోదరుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో సంచలం క్రియేట్ చేశారు..స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాను బాధ్యతలు నిర్వహించిన పదవి కంటే తక్కువ పదవికి నామినేషన్ వేసి షాకిచ్చారు. ఇది ఏపీలో సంచలనం అయింది, అయితే అదే మున్సిపాలిటీ నుంచి ప్రభాకర్ రెడ్డి రాజకీయంగా పేరు సంపాదించారు ఇక ఖాళీగా ఉండటం ఎందుకు అని పోటీ చేస్తున్నారట.

తాడిపత్రి మున్సిపాలిటీ 30వ వార్డుకు కౌన్సిలర్ గా ఆయన నామినేషన్ వేశారు. ప్రభాకర్ రెడ్డి తరపున ఆయన న్యాయవాదులు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు అదే వార్డు నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేయడంతో అక్కడి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఓపక్క ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం బెటర్ అని అన్నయ్య చెబుతుంటే తమ్ముడు మాత్రం పోటికి దిగారు. చూడాలి ఈ మున్సిపల్ పోరు ఎలా ఉంటుందో.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.