జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోరు మరి జగన్ ప్లాన్ ఏమిటి

Junior NTR will not agree and what is the Jagan plan

రాజకీయాల్లో నిన్నటిది పాత కధ, నేడు కొత్త కధ, కాని నిన్నటి నుంచి వైసీపీ గడపల్లో నుంచి పసుపు గడపల వరకూ ఓ వార్త వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ ఒప్పందానికి జగన్ ఉరుకులు పరుగులు పెడుతున్నారు ఇది వార్త, కాని దీని వెనుక చాలా పొలిటికల్ ప్లాన్స్ ఉన్నాయి. అంత సులువుగా జగన్ ఏ స్టెప్ వెయ్యడు, దాని వెనుక ఉన్న సాధక బాధకాలు అన్నీ తెలిసి వేస్తాడు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు, కాని ఏమీ చేయలేరు అని సీఎం జగన్ ఎందుకు అంటారో తెలుసా? మచ్చుకు కొన్ని ఉన్నాయి చూద్దాం..సరే మామ పార్టీని తీసుకున్నారు పోని అది వారి కుటుంబ వ్యవహారం.

సీఎం అయ్యే స్ధాయి చంద్రబాబుకి రావడానికి కారణం మామ ఎన్టీఆర్ ఆయనకు భారత రత్న ఇప్పించలేకపోవడం.
ఐదు సంవత్సరాల్లో ఎన్టీఆర్ పేరుపై ఓ అద్బుతమైన కట్టడం కడతారు అని అమరావతిలో అనుకున్నారు అది జరగలేదు.
కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెడతారు అని అనుకున్నారు పోని ఆయన గ్రామానికి కూడా పెట్టలేదు.
ఇవన్నీ చంద్రబాబు చేయగల సమర్ధుడే పైగా అధికారము ఉంది అయినా పట్టించుకోలేదు.

అయితే జగన్ మాత్రం ప్రతీ అంశం పట్టించుకుంటారు .ఎన్టీఆర్ పేరుపై కృష్ణా జిల్లా అనే సరికి సొంత సామాజికవర్గం సైతం బాబుపై తిరగబడింది. జగన్ ఆలోచన మనకు రాలేదు, వచ్చినా మనం ఆచరించలేదు. మన మీడియా గుర్తు చేయలేదు. జగన్ టీమ్ బాగుంది అని అనుకోవడం మినహ ఏమీ చేయలేకపోయింది. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఐదు సంవత్సరాలు అమరావతికి మంచి బ్రాండ్ తీసుకురావచ్చు అది చంద్రబాబు చేతిలో పని. పైగా జూనియర్ ని అడిగితే చేసేవాడు పైగా బాలయ్య హరి కృష్ణ అందరూ చెబితే కచ్చితంగా చేస్తారు. కాని చంద్రబాబు మదిలో ఈ ఆలోచన రాలేదు.

ఈఐదు సంవత్సరాలు రాజధాని గ్రాఫిక్స్ దగ్గరే బాబు ఉండిపోయాడు. సో జగన్ మాత్రం నేరుగా నందమూరి కుటుంబాన్ని కూడా తన మంచి పరిపాలనలో వాడాలి అని భావిస్తున్నారు. ఇది మంచి విషయమే, టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఉన్నారు తారక్, అందుకే ఆయన బ్రాండింగ్ చేస్తే కొంచెం అమరావతికి మేలు జరుగుతుంది అని జగన్ ఆలోచన. దీనిన ఎవరూ కాదు అనలేని మాట. సాధారణ వ్యక్తులు కంటే సెలబ్రెటీలు చెబితేనే మార్పు డవలప్ మెంట్ జరుగుతుంది అనేది 1956 నుంచి వస్తున్న విధానం. అందుకే యాడ్స్ కూడా అంత ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ,పారిశ్రామిక, పర్యాటకం రంగాలను బాగా అభివృద్ధి చేయాలనీ జగన్ అనుకున్నాడు. అందులో భాగంగా ప్రతి రంగానికి బ్రాండ్ అంబాసిడర్ ని నిమించాలని అనుకున్నారు. అందులో ఒక దానికి జూనియర్ ఎన్టీఆర్ ని నియమించాలని, జగన్ భావన బాగుంది మరి కొడాలి నాని లేదా నార్నే శ్రీనివాసరావు ఇద్దరూ కూడా ఎన్టీఆర్ కు బాగా కావలసిని వారు, మరి వీరిద్దరితోనే జగన్ ముందుకు వెళుతున్నారు. నిజంగా ఈ విషయంలో రాజకీయాలు ఆలోచించకుండా ముందుకు ఎన్టీఆర్ వస్తే గ్రేట్ అనాల్సిందే.

లేదు ఐదేళ్ల తర్వాత కాకపోయినా 10 ఏళ్ల తర్వాత తాను రాజకీయాల్లోకి వస్తారు, పార్టీని తీసుకుంటారు కాబట్టి ఈ సమయంలో జగన్ మాట విని సపోర్ట్ చేస్తే తన రాజకీయాలకి ఇది ఎఫెక్ట్ అని తారక్ ఆలోచిస్తే ఈ ఆఫర్ తిరస్కరిస్తారు.. సో తిరస్కరిస్తే తారక్ పొలిటికల్ ప్లాన్ ఒకే అని చెప్పాలి.. తిరస్కరించకపోతే రాజకీయాలకు ఇప్పుడు వచ్చే ఆలోచన లేదు అని తెలుసుకోవాలి.. తారక్ డెసిషన్ బట్టి పాలిటిక్స్ కూడా మారిపోతాయి. పైగా చంద్రబాబు చేయించలేనిది జగన్ చేయించారు అంటే ఇది గొప్ప విషయం అనిపించక మానదు. సో అది దీని వెనుక అర్ధం,అమ్మ జగనా అని రాసే ఎల్లో మీడియాలు ఇప్పుడు ఇలాంటి వార్త రాసే సాహసం చేయగలవా? ఇది అవాస్తవం కాకుండా నిజం అయితే మాత్రం సీఎం జగన్ ప్లాన్ అదిరింది అని చెప్పాలి.

విశ్లేషణ-వీజీ

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.