జూనియర్ కు నో ప్లేస్ అంటున్న సీఎం జగన్

Junior to no place says CM Jagan

తెలుగుదేశం పార్టీ పరిస్దితి ఇప్పుడు ఏపీలో ఎలా ఉందో తెలిసిందే, ఓ పక్క అచ్చెన్నాయుడు బుచ్చయ్య చౌదరి మినహా బాబు వెనకాల రాజకీయంగా ఆయనకు సపోర్ట్ చేసేది ఎవరూ లేరు అనేది అసెంబ్లీలో స్పష్టంగా కనిపిస్తోంది. 50 మంది వరకూ నాయకులు ఉన్న ఆనాటి సభ నేడు తెలుగుదేశం పార్టీకి ఇంతటి దారుణమైన పరాభవం తీసుకువచ్చింది. ఇక ఎవరిని కదిలించినా తెలుగుదేశం పార్టీకి పాత వైభవం రావాలి అంటే నారాలోకేష్ వల్ల అవ్వదు అంటున్నారు.. అలాగే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఒక్కరే ఇప్పుడు ముందుకు తీసుకువెళ్లడం కూడా కష్టం, అందుకే ఎన్టీఆర్ మనవడు ఆయన రాజకీయ వారసుడు అనుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ని తెరపైకి తీసుకురావాలి అని అంటున్నారు..

పోని బాలయ్య బాబు ఉన్నారు కదా అంటే, ఆయన ఎవరిని ఎప్పుడు కోపం వచ్చి కొడతారో తెలియదు. అలాంటి వారికి పార్టీ పగ్గాలు ఇస్తే అసలుకే మోసం అందుకే తెలుగుదేశం నేతలు కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయంగా తీసుకురావాలి అని అంటున్నారు.. పైగా సినిమాలు సినిమాలు బీజీ షెడ్యూల్ అంటున్న జూనియర్ కు చంద్రబాబు నచ్చెప్పాలి అంటున్నారు.. ఎందుకు అంటే సినిమా అంటే ఓ కోటి మంది అభిమానులు ఉంటారు. అయితే రాజకీయాల్లోకి వస్తే ఆయనకు 5 కోట్ల మంది ఫ్యాన్స్ వస్తారు. అందుకే ఆయనకు అవకాశం ఉంది కాబట్టి లోకేష్ పై ప్రేమని పక్కన పెట్టి ఆ ఆప్యాయత జూనియర్ ఎన్టీఆర్ పై చూపించి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలి అని చెబుతున్నారట.

దీనిపై బాబుకు కూడా కోపం నషాలానికి అంటింది అని చెబుతున్నారు పార్టీ నేతలు.. దీనిపై కొందరు పార్టీ నేతలతో బాబు గారు స్పందిస్తూ, జూనియర్ వచ్చి ఇప్పుడేం చేస్తారు. మా కుటుంబంలో నుంచి ఎవరు రారని మనమే కష్టపడి పార్టీని రక్షించుకోవాలని హిత బోధ చేసారని సమాచారం.

మరో పక్క జగన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ఆ ప్లేస్ ఇచ్చే అంత సీన్ లేదు. ఎందుకు అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైగా జగన్ దూకుడు చూస్తుంటే కేంద్రంతో సఖ్యతగా ఉంటూ ఏపీకి కావలసిన అన్ని పనులు చక్కబెట్టించుకోవాలి అని చూస్తున్నారు. జూ ఎన్టీఆర్ వచ్చినా ఇక్కడంటూ ఒక ప్లేస్ అంటూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలించడం లేదు, ఆయన అవినీతికి పాల్పడుతున్నాడు, ప్రజా సేవ చేయడం లేదు అనే పరిస్థితి ఉంటే ఆ ప్లేస్ దొరుకుతుంది. కాని జగన్ ఆ ప్లేస్ ఇచ్చేలా కనిపించడం లేదు. అందుకే జూనియర్ కూడా ఇలాంటి డెసిషన్ తీసుకోడు అంటున్నారు. సో రాజకీయంగా ఎన్టీఆర్ ఆలోచన ఎలా ఉందో మాత్రం ఎవరూ చెప్పరు.. కాని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అనేది తమకు తెలుసు అంటున్నారు కొందరు నందమూరి కుటుంబ సభ్యులు.. మరి అది ఎప్పుడో చూడాలి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.