జూపూడికి కీలక పదవి బాబుకు మరో ఎర్త్

Jupudi prabhakar rao joined YSRCP

తెలుగుదేశం పార్టీకి వరుస షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి, ఇటు పార్టీ ఓటమి తర్వాత ఒకరి తర్వాత ఒకరు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు..దసరా పర్వదినాన వివిధ పార్టీలకు చెందిన నేతలు జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. జనసేన నేత ఆకుల సత్యనారాయణ, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఇక్కడ జూపూడి చేరికను కొందరు వ్యతిరేకించినా . సీఎం జగన్ పార్టీ అధినేత ఒప్పుకుంది మనకు ఇబ్బంది ఏమి ఉంది అనేలా ఉన్నారు.

అయితే ఇక్కడ ఓ కీలక విషయం చూసుకుంటే, జూపూడి ఎప్పుడూ వైయస్ కుటుంబానికి వీర విధేయుడు. ఎందుకు అంటే వైయస్ ఆయనకు రాజకీయంగా ఇంత పదవి పోస్టులు కలిగించారు. కాని రాజకీయ పరిస్దితులు ఆయనని సైకిల్ ఎక్కేలా చేశాయి. చంద్రబాబు ఇచ్చిన రెండు పదవులు జగన్ ని విమర్శించేలా చేశాయి, అయితే ఏపీలో అధికంగా ఉన్న ఎస్సీ సామాజికవర్గాన్ని చంద్రబాబు విస్మరించారు కాబట్టి, జగన్ కు వారు పట్టం కట్టారు, అందుకే జగన్ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు ఉపకరిస్తుంది అని భావించి ఆయనని పార్టీలో చేర్చుకున్నారు.

మొత్తానికి జూపూడి చేరికతో ఇటు టీడీపీ డీలా పడిపోయింది. ఇక తెలుగుదేశం పార్టీని ఆయన వీడటం ఊహించని షాక్ అంటున్నారు సొంత పార్టీ నేతలు. ఇక ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి వైసీపీ వాయిస్ వినిపించాలి అని జగన్ చూస్తున్నారు. మొత్తానికి గతంలో జగన్ పై ఎలా జూపూడి విమర్శలు చేశారో అలాగే ఇప్పుడు టీడీపీ పై తన వాయిస్ మరింత గట్టిగా వినిపించనున్నారట. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు? ఎవరు శత్రువులుగా ఉండరు ఎవరూ మిత్రులుగా ఉండరు, ఇది మాత్రం అందరూ గమనించాల్సిందే.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.