కరుణానిధి రాజ‌కీయ ప్ర‌స్ధానం

Veteran DMK leader Karunanidhi death

క‌రుణానిధి క‌న్నుమూత అనే విష‌యం తెలియ‌గానే త‌మిళ‌నాడు అంతా శోక‌సంద్రంలో మునిగిపోయింది.. దేశంలోనే అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు ఆయ‌న‌.దక్షిణాదిన సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తొలి వ్యక్తి కరుణానిధి. ఇప్ప‌టికి ఎప్ప‌టికి ఆ రికార్డు ఆయ‌న పేరుమిద చిర‌స్ధాయిగా ఉండిపోతుంది.

తమిళ భాషన్నా, సంస్కృతన్నా, సాహిత్యమన్నా కరుణానిధికి ఎంతో అభిమానం. అదే ఆయనను తమిళ రాజకీయాల్లో అడుగు పెట్టేలా చేసింది. కళైంజర్ అనేది ఆయన బిరుదు. అంటే ‘కళాకారుడు’ అని అర్థం. ఆయన 14 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయల్లోకి వచ్చారు. ఆనాటి జస్టిస్ పార్టీ నేత అలగిరిస్వామి స్ఫూర్తితో హిందీ వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు

అక్క‌డ స్థానిక యువకులతో కలిసి “తమిళనాడు తమిళ మానవర్ మాండ్రం” పేరుతో ఓ విద్యార్థి సంఘాన్ని స్థాపించారు ఆయ‌న . ఆ తర్వాత కల్లకుడి ఉద్యమంతో ఆయన పేరు మార్మోగింది. 33ఏళ్ల వయస్సులో తొలిసారి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1957లో కులత్తలై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత వెనుదిరిగి రాజ‌కీయాల్లో చూసుకోలేదు. ఆనాటి నుంచి అలుపెరగని ఈ రాజకీయ కురువృద్ధుడికి ఓటమన్నది తెలియదు.

1957 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఆయ‌న గెలుస్తూ గెలుస్తూ వచ్చారు. మొత్తం 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 13 సార్లు గెలిచారు. 1984 ఎన్నికల్లో మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1969లో తొలిసారి సీఎం పదవిని అలంకరించిన ఆయన.. 2006లో ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యారు. జాతీయ రాజకీయాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అవసరమైన ప్రతిసారి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రపతులు, ప్రధానమంత్రుల ఎంపికలో ఆయ‌న కీలక పాత్ర పోషించారు.

సంవత్సరాల వారీగా కరుణానిధి రాజకీయ చరిత్ర..
పెరియార్‌ రామస్వామి నాయక్కర్‌ ప్రవచిత ద్రావిడ భావజాలం పట్ల ఆకర్షితులైన కరుణానిధి.. 1944లో ద్రావిడ కళగంలో ప్రవేశించారు.
ఆ తరువాత పెరియార్‌తో విభేదించి… 1949లో అన్నాదురై స్థాపించిన డీఎంకేలో పనిచేశారు.
తొలిసారి 1957లో కులత్తలై నియోజకవర్గం నుంచి కరుణానిధి గెలుపొందారు.
1961లో డీఎంకే కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.
1967లో డీఎంకే అధికారంలోకి వచ్చాక ప్రజా పనులశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
1969లో అన్నాదురై మృతితో తమిళనాడు సీఎంగా కరుణానిధి బాధ్యతలు చేపట్టారు.
1977లో ఎంజీఆర్‌ సీఎంగా ఎన్నికయ్యాక… 13 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నారు.
ఎంజీఆర్‌ మరణానంతరం 1989లో కరుణానిధి సీఎం పదవి చేపట్టారు.
1971లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
1991లో డీఎంకే ఘోర పరాజయం
1996 ఎన్నికల్లో డీఎంకే అద్భుత విజయంతో మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
2001లో జయలలిత చేతిలో మళ్లీ కరుణానిధి పార్టీ ఓటమిపాలైంది.
2006 మే 13న మరోసారి కరుణానిధి తమిళనాడు అధికార పగ్గాలు చేపట్టారు.
2011లో మళ్లీ అధికారానికి దూరమయ్యారు.
ఇలా 1957 నుంచి 2016 వరకు మొత్తం 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన కరుణానిధి.. ప్రస్తుతం తిరువారూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.