janampulse

కవితకు కేసీఆర్ గుడ్ న్యూస్

KCR good news for Ex MP Kavitha

టీఆర్ ఎస్ పార్టీలో రాజ్యసభ సీట్ల గురించి చర్చ జరుగుతోంది .. ఎవరికి ఆ పదవులు వస్తాయి అని చర్చించుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖాయమైందట.. త్వరలో ఖాళీ అయ్యే రెండు స్ధానాల్లో ఆమెకి ఓ సీటు ఇస్తారట.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 7, ఆంధ్రప్రదేశ్కు 11 రాజ్యసభ స్థానాలు కేటాయించారు.

ప్రస్తుతం తెలంగాణ నుంచి ఐదు రాజ్యసభ స్థానాలకు టీఆర్ ఎస్ నుంచి జోగినపల్లి సంతోషకుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరో రెండు స్థానాలకు బీజేపీకి చెందిన గరికపాటి మోహన్రావు, కాంగ్రెస్ నేత కేవీపీ రామచందర్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కోటాలోకి వెళ్లారు.ఏప్రిల్ 9న ఆరుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో రెండు తెలంగాణ నాలుగు ఏపీ లో ఖాళీ అవుతున్నాయి.

తెలంగాణ నుంచి గరికపాటి, కేవీపీ పదవీ విరమణ చేస్తారు. ఏపీ కోటాలో ఉన్న కేకే కూడా అదే రోజు పదవీ విరమణ చేయనున్నారు. ఇక తెలంగాణలో ఎమ్మెల్యేల బలం దృష్ట్యా ఆ రెండు స్థానాలూ టీఆర్ఎస్ కి వస్తాయి, ఏప్రిల్ 9న వీటిని భర్తీ చేయాలి అని కాని కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి-మార్చిలోనే ఎన్నికల ప్రక్రియను ముగించనుంది.

ఇప్పటికే ఏపీ కోటాలో ఉన్న కేకేకు మళ్లీ సభ్యత్వం దక్కడం అనుమానమే అంటున్నారు. పార్టీకి కేకే అనుభవం ఉపయోగించుకుంటారట
ఏదో ఒక ఉన్నత స్థానాన్ని కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒక స్థానం సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు ఖాయమంటున్నారు. తెలుగు, హిందీ, ఆంగ్ల, ఉర్దూ భాషలపై పట్టు, చొరవ. ఉండటం గతంలో ఆమె ఎంపీగా పనిచేయడం, హస్తినలో పెద్దలతో పార్టీ పనులు ప్రభుత్వ పనులు చేయించడంలో అనుభవం ఉండటంతో కవితకే సీటు అని అంటున్నారు.

ఇక రెండో సీటు కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే ఆర్ సురేశ్రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, సిరికొండ మధుసూదనాచారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. కొత్తగా టీడీపీ నుంచి నామా నాగేశ్వర్రావును చేర్చుకొని టికెట్ ఇచ్చారు. ఆయన ఎంపీ సీటు వదులుకోవడంతో ఆయనకు ఇస్తారు అనే ప్రచారం సాగుతోంది. మునిసిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాతే రాజ్యసభ బెర్త్లపై స్పష్టత వస్తుందని కారు పార్టీ నేతలు చెబుతున్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.