
కేసీఆర్ ఆయనకి గుడ్ న్యూస్ వినిపిస్తారా
కేసీఆర్ లెక్కలు చానా వేరుగా ఉంటాయి, సరైన రాజకీయ నిర్ణయం తీసుకోవాలి అంటే అది కేసీఆర్ తోనే అంటారు, అందుకే ఉద్యమాన్ని ముందుండి నడిపించి ఏకంగా తెలంగాణ సాధించుకున్నాడు అంటారు, అయితే ఆయన పార్టీలో పదవులు విషయంలో కూడా అలాగే ఆలోచిస్తారు.. పార్టీపై నిబద్దత కమిట్మెంట్ ఉన్న నేతలకు పదవులు ఇస్తారు .. ప్రజల్లో ఫేమ్ ఉంటే వెంటనే పిలిచి పదవి ఇస్తారు కేసీఆర్.
తాజాగా ఆయన కేకే అలాగే సురేష్ రెడ్డికి ఇద్దరికి రాజ్యసభ సీట్లు ఇచ్చారు, తాజాగా మరో నాయకుడి రాజకీయం గురించి ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో .సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగిన మండవ వెంకటేశ్వరరావు తెలంగాణ వచ్చిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.
అయితే గత లోక్ సభ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ స్వయంగా మండవ ఇంటికి వెళ్లి మరీ ఆయనను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. దీంతో ఆయన కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే ఆ తర్వాత పార్టీలో పెద్దగా ఆయన కనిపించింది లేదు కాని ఆయన ఫేమ్ మాత్రం ప్రజల్లో అలాగే ఉంది, తాజాగా ఆయనకి కేసీఆర్ కీలక పదవి ఇస్తారు అని వార్తలు వస్తున్నాయి.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడటంతో… ఈ సీటు టీఆర్ఎస్ తరపున ఎవరికి దక్కుతుందనే దానిపై టీఆర్ఎస్లో జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సీటు మండవకు దక్కుతుంది అంటున్నారు చూడాలి కేసీఆర్ నిర్ణయం ఎట్టా ఉంటదో.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్