14 న జగన్ ఇంటికి కేసీఆర్

KCR on Jagan new house opening in Amravati on 14th

జగన్ కొత్త ఇంటి నిర్మాణం పూర్తి అయింది ..ఇక తాడేపల్లిలో నిర్మించిన ఇంటిలోకి జగన్ ఫిబ్రవరి 14 న గృహప్రవేశం కానున్నారు.. అయితే ఆయన కుటుంబం ఇక ఇక్కడే ఉండనుంది.. లోటస్ పాండ్ కు జగన్ ఇకగుడ్ బై చెబుతారు. సో అక్కడ ఆయన సోదరి ఉంటారు అని తెలుస్తోంది. ఇక అమరావతి వేదికగా ఏపీ నుంచి ఎప్పుడు వైసీపీ కార్యకలాపాలు జరుగుతాయి అని ఎదురుచూసిన అభిమానులకు అందరికి ఈ న్యూస్ ఆనందం కలిగించింది. ఇది వైసీపీ నాయకులకు పండుగ రోజు అనే చెప్పాలి.

ఇక్కడ పార్టీ కార్యాలయం కూడా ఉంటడంతో జగన్ కు మరింత వెసులుబాటు ఉండనుంది. నేరుగా ఇంటినుంచి కార్యాలయంలోకి నాయకులతో భేటీలు వరుసగా ఏర్పాటు చేసుకోనున్నారు..అయితే కేసీఆర్ ని జగన్ గృహప్రవేశానికి ఆహ్వానించారు అని కొన్ని మీడియాలు వార్తలు వదులుతున్నాయి.. అయితే ఇందులో వాస్తవం లేదు అని కేవలం ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి పిల్లలతో, అలాగే సోదరి కుటుంబం పులివెందులలో కొందరు కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేస్తారు అని తెలియచేశారు వైసీపీలో సీనియర్ నాయకులు.

అంతేకాని వేరే రాజకీయ నాయకులని ఎవరికి ఈ కార్యక్రమానికి పిలవడం లేదని, వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఇంచార్జులు మాజీ ఎంపీలు వస్తారు అని తెలియచేశారు.. జనవరి ఎండింగ్ లో బస్సుయాత్ర షెడ్యూల్ ప్రకటించనున్నారు.. అయితే జగన్ బస్సుయాత్ర ఫిబ్రవరి మొదటి వారంలో ఉంటుంది అని, ఆ వారం తర్వాత జగన్ ఇంటి గృహప్రవేశం జరుగుతుంది అని అక్కడ నుంచి మళ్లీ బస్సుయాత్ర ఉంటుంది అని చెబుతున్నారు నేతలు.. ఇక ఆయన గుంటూరు జిల్లా నుంచి బస్సుయాత్ర మొదలు పెట్టే అవకాశం ఉంది అని చెబుతున్నారు నాయకులు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.