జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

KCR who told good news to Jagan - YSRCP - TRS

తెలంగాణలో ఎన్నికలు ముగిసిపోయాయి.. టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టింది.. ఇక తెలంగాణలో వచ్చిన ఎన్నికల ఫలితాలతో లగడపాటి రాజకీయాల నుంచి ఎలా సన్యాసం తీసుకున్నారో, అలాగే సర్వేలకు తీసుకోవాలి అనే డిమాండ్ ప్రజల నుంచి వచ్చింది. ఇప్పుడు ఏపీలో లగడపాటి సర్వే అని ఎక్కడైనా వస్తే అసలు దాని వైపు ఒక్కరు కూడా చూడరు, లగడపాటి చుట్టు ఇప్పుడు అన్నిగ్రహాలు సంచరిస్తున్నాయి అనేచెప్పాలి. ఇక జనంపల్స్ తెలుసుకోలేకపోయాడు, కేవలం బాబు కాంగ్రెస్ పల్స్ తెలుసుకున్నాడు లగడపాటి అని విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో తెలంగాణ సమాజం కూడా ఏపీ ఎన్నికల గురించి చూస్తోంది. తెలంగాణలో 2024 వరకు కారు పార్టీకి ఢోకా లేదు. ఇక ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అనేలా చూస్తున్నారు అందరూ. ఇప్పటికే చాలా సర్వే లు ఏపీకి వచ్చాయి . అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.? ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది.? అన్న విషయమై తెలంగాణలో సర్వేలు జోరందుకున్నాయి అని అంటున్నారు అనలిస్టులు, ఇక సెగ్మెంట్ల వారిగా కూడా సర్వేలు చేస్తున్నారు పార్టీల అధినేతలు, ఓ పక్క జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ తో సర్వేల్లో ఉన్నారు..

అయితే తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టిన సీఎం చంద్రబాబుకి, నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, ఏపీ రాజకీయాల్లో వేలు పెడతా అన్న కేసీఆర్ తనదైన స్ట్రాటజీ చూపుతున్నారు. ఇప్పటికే తను అంతర్గత సర్వేలు నిర్వహించి తెలంగాణలో ఎవరు గెలుస్తారు అనేది చూసి వారికి టిక్కెట్లు ఇచ్చి రెండోసారి గెలిచారు.. ఇప్పుడు అదే ప్రణాళికలతో కేసీఆర్ ఏపీలో కూడా యోచిస్తున్నారు. తెలంగాణలో 75 శాతం గెలుపు టీఆర్ఎస్ దే అయింది. ఇక ఏపీలో కూడా కేసీఆర్ సర్వే చేయించారట.. ఇక్కడ నాలుగు ఎంపీ స్ధానాలు కూడా టీడీపీ గెలవదు అని, కష్టం అని తేలిందట. అలాగే 25 నుంచి 32 అసెంబ్లీ స్ధానాలు టీడీపీ గెలుచుకుంటుంది అని, 8 స్ధానాల్లో జనసేన గట్టిపోటీగా ఉంది అని వచ్చిందట. మిగిలిన సీట్లు అన్నీ వైసీపీ సునాయాసంగా గెలుచుకుంటుంది అని, టీడీపీ ఏపీలో తట్టా బుట్టా సర్దేసినట్టే అని చెబుతున్నారు ఇక్కడ నేతలు….సో ఇది కూడా జగన్ కు సపోర్ట్ గానే వచ్చిన సర్వే రిపోర్టు అని ఇంటర్నల్ గా తెరాస నాయకులు చెబుతున్నారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.