janampulse

కాంగ్రెస్ కి ఫైనల్ మాట చెప్పేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy-Rajgopal-Reddy tell the final decision to the Congress

తెలంగాణలో గతంలో ఓ మాట వినిపించేది.. సీఎం అభ్యర్దులు ఎక్కువ ఎమ్మెల్యేలు తక్కువ అని.. ఇప్పటికీ అలాగే ఉంది… ప్రతీ నాయకుడు తనకే పదవి తనకే పదవి అంటున్నారు …కాని పార్టీని పదవిలోకి అధికారంలోకి తీసుకువచ్చే పరిస్దితి మాత్రం కనిపించడం లేదు అనేది జనం చెప్పేమాట.

తాజాగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి పార్టీ మార్పుపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం గతరెండు సార్లు సరైన నాయకత్వాన్ని టీపీసీసీ చీఫ్ ఎంపిక చేయడంలో విఫలమైందని, టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈసారి పీసీసీ చీఫ్ పదవి తమకు రాకపోతే బీజేపీలోకి వెళ్లడమా లేక సొంతపార్టీని ఏర్పాటు చేసుకోవడమా అనేది భవిషత్తు నిర్ణయిస్తుందని ఫైనల్ గా చెప్పేశారు, అయితే ఆయన ఇటీవల రెండు నెలలుగా పార్టీ తరపున మరింత యాక్టీవ్ అయ్యార.

అంతకుముందు ఆయన బీజేపీలోకి వెళ్లిపోతున్నారు అని వార్తలు వినిపించాయి..మొత్తానికి ఆయన పార్టీలో ఉండటమా లేదా బీజేపీలో చేరుతారా లేదా సొంత గూడు కట్టుకోవడమా అనేది ఆలోచన చేస్తున్నారు, అయితే అధిష్టానానికి కూడా ఇదే పెద్ద తలనొప్పి అయింది. గత లోక్సభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్లో ఒడిపోయినప్పుడు కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు అని విమర్శించారు, మొత్తానికి ఆయన అల్టిమేటం చూస్తు ఉంటే. ఈసారి కాంగ్రెస్ ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే అంటున్నారు ఆయన ఫ్యాన్స్ .

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.